Jharkhand Girl Suicide: మానసికస్థితి క్షీణించడం వల్ల ఓ యువకుడు కొన్నేళ్ల క్రితం తన కన్నతల్లిని హత్య చేశాడు. అందుకు గాను మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తీరా జైలు నుంచి విడుదలయ్యాక తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అతడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. అది కాస్త విఫలమైంది. ఆ తర్వాత రోజే యువకుడి చిన్న చెల్లెలు రైలు కింద పడి ఆత్మహత్మకు పాల్పడింది. ఝార్ఖండ్లో జరిగిన ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఏం జరిగిందంటే?.. పలాము జిల్లాలోని భదుమ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు మానసికస్థితి క్షీణించి తన సొంత తల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత మూడేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. ఆ తర్వాత యువకుడు తన ఇంట్లో అక్కాచెల్లెళ్లతో నివసిస్తున్నాడు. అది నచ్చని అతడి ముగ్గురు సోదరీమణులు గురువారం(జూన్ 9) సోదరుడిని చంపి కాల్చడానికి ప్రయత్నించారు. మొదట అతడి తలపై గాయపరిచి, ఆపై కిరోసిన్ పోసి సజీవదహనం చేయడానికి ప్రయత్నించారు. యువకుడు ఒక్కసారి గట్టిగా కేకలు వేయడం వల్ల వారి ప్లాన్ విఫలమైంది. బాధితుడు అరుపులు విన్న గ్రామస్థులంతా చేరి అతడిని కాపాడి ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ ఘటన తర్వాత శుక్రవారం సాయంత్రం అతడి చిన్న చెల్లెలు పూనమ్ కుమారి.. రైలు కింద ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం