ETV Bharat / bharat

ఎత్తైన భవనంపై మహిళ దుస్సాహసం... కిటికీ బయట నిల్చొని.. - ఎత్తైన భవనంపై కిటికీ అద్దాలు తుడుస్తూ

Woman cleaning window glasses: కిటికీ అద్దాలు తుడిచేందుకు ఓ మహిళ నాలుగు అంతస్తుల భవనంపై దుస్సాహసం చేసింది. ప్రమాదకర రీతిలో కిటికీ బయటివైపు రెయిలింగ్​పై నిల్చొని.. అద్దాలు తుడిచింది. స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైంది.

woman cleaning window glasses
woman cleaning window glasses
author img

By

Published : Feb 21, 2022, 10:59 AM IST

Updated : Feb 21, 2022, 12:36 PM IST

ఎత్తైన భవనంపై మహిళ దుస్సాహసం

Woman cleaning window glasses: ఆకాశహర్మ్యాలలో నివసిస్తున్న ప్రజలు ఈ మధ్య అధికంగా ప్రమాదాలకు గురవుతున్నారు. నివాసితుల నిర్లక్ష్యం కూడా కొన్ని ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లోని ఇందిరాపురంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు మహిళకు ఎలాంటి ప్రమాదం జరగకపోయినా.. ఆమె నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

woman cleaning window glasses

శిప్రా రివేరా సొసైటీలో ఓ భవనంలోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న మహిళ.. కిటికీ రెయిలింగ్​పై నిల్చొని అద్దాలను తుడిచింది. ఓ దశలో ఒంటికాలిపై కిటికీపై నిల్చుంది. కొంచెం పొరపాటు జరిగినా.. కాలు జారి కింద పడే ప్రమాదం ఉంది. కానీ ఆ మహిళ మాత్రం ఇవేం ఆలోచించకుండా.. పూర్తిగా కిటికీ అద్దాలు తుడవడంపైనే దృష్టిపెట్టింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రమాదకర రీతిలో ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

woman cleaning window glasses
కిటికీ తుడుస్తున్న మహిళ

చుట్టుపక్కల వారు మహిళను చూసి.. వీడియో తీశారు. ఆమెను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. గట్టిగా అరిచి ఆమెను పిలిచేందుకు యత్నించినా.. మహిళ వినిపించుకోలేదు. దీంతో కొంతమంది వెళ్లి ఆమె ఇంటి తలుపు కొట్టారు. అప్పుడు ఆమె వెళ్లి తలుపులు తీసింది. మహిళకు స్థానికులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా ప్రమాదకరంగా కిటికీపై నిల్చోవద్దని సూచించారు.

Accidents in High rise buildings

ఇటీవల ఎత్తైన భవనాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గాజియాబాద్​లోని ఇందిరాపురం, రాజ్​నగర్ ఎక్స్​టెన్షన్, క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతాల్లో చిన్నపిల్లలు భవనంపై నుంచి పడిపోయారు. పెద్దలు సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

ఇదీ చదవండి: చీర కోసం మహిళ దుస్సాహసం.. కుమారుడ్ని 9వ అంతస్తు నుంచి వేలాడదీసి..

Last Updated : Feb 21, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.