చనిపోయిన భర్త బతికే ఉన్నాడని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకొని రూ.1.60 కోట్లను కాజేసింది ఓ మహిళ. భర్త బ్రతికే ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 25 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆ తరువాత 14 రోజులకే చనిపోయాడని ఆ మొత్తం క్లైమ్ చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీని బోల్తా కొట్టించింది. మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సదరు బీమా సంస్థ కోర్టును ఆశ్రయించింది.
ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన పూల్భాయ్ అనే మహిళ చనిపోయిన తన భర్త తుకారంపై 25 సంవత్సరాలకు 2012లో ఇన్స్‌రెన్స్ పాలసీ తీసుకుంది. తీసుకున్న 14 రోజులకే అతడు చనిపోయాడని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.1.60 కోట్లను క్లెయిమ్ చేసుకుంది. భర్త చనిపోయిన విషయాన్ని కంపెనీకి తెలియకుండా జాగ్రత్త పడింది పూల్భాయ్. అందుకు ఇన్సూరెన్స్ ఏజెంట్ బద్రిలాల్ సహాయం తీసుకుంది. ఇద్దరు కలిసి తుకారం బ్రతికే ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారు. వెరిఫికేషన్ సమయంలో వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించారు. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చి మరోసారి వెరిఫికేషన్ చేసుకుంది. దీంతో జరిగిన మోసం బయటపడింది. మహిళ మోసంపై ఆశ్చర్యపోయిన కంపెని మోసాన్ని గ్రహించి కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవీ చదవండి: