ETV Bharat / bharat

'బంగాల్​.. ఉగ్రవాదులకు అడ్డాగా మారింది' - బంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అసదుద్దీన్

బంగాల్​.. ఉగ్రవాదులకు నిలయంగా మారిందని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. నార్త్​ 24 పరగణాల జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన దిలీప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు కశ్మీర్​ కన్నా దారుణంగా ఉన్నాయన్నారు.

Dilip_Ghosh
'బంగాల్​ ఉగ్రవాదులకు నిలయంగా మారింది'
author img

By

Published : Nov 15, 2020, 4:47 PM IST

బంగాల్​లో ప్రస్తుత పరిస్థితులు కశ్మీర్​ కన్నా దారుణంగా ఉన్నాయని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బంగాల్​ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిలీప్​.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"బంగాల్​ ఉగ్రవాదులకు నిలయంగా మారింది. ఉత్తర బంగాల్​లోని అయిపుర్​దార్​లో ఇటీవలే ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు అధికారులు. రాష్ట్రంలో పలు టెర్రరిస్టు ముఠాలు తయారయ్యాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారని ఇటీవలే బంగ్లాదేశ్ నాయకుడు ఖలేదా జియా కూడా ఆరోపించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం కశ్మీర్​ కన్నా దారుణంగా ఉంది".

- దిలీప్ ఘోష్, బంగాల్​ భాజపా అధ్యక్షుడు.

ఎన్నికల కసరత్తు...

రానున్న బంగాల్​​ ఎన్నికల్లో ఏఐఎమ్​ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలపై దిలీప్ స్పందించారు. ఎవరు పోటీ చేసినా తమకు ఎలాంటి నష్టం జరగదని, ప్రజలకు భాజపాపై పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అమానుషం: క్షుద్రపూజలకు చిన్నారి బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.