ETV Bharat / bharat

'విదేశాలకు భారత​ టీకా సరఫరాపై కరోనా ఎఫెక్ట్​' - కరోనా వ్యాక్సిన్​ ఇండియా

అనేక దేశాలకు కరోనా టీకా సరఫరా చేస్తూ వస్తోంది భారత్​. అయితే దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో విదేశాలకు భారత్​ నుంచి వెళ్లే టీకాల సంఖ్య తగ్గే అవకాశముందని గవీ సీఈఓ బెర్క్​లే పేర్కొన్నారు.

With rise in COVID-19 cases, India likely to make less availability of vaccines globally: Gavi
'విదేశాలకు భారత​ టీకా సరఫరాపై కరోనా ఎఫెక్ట్​'
author img

By

Published : Apr 6, 2021, 12:18 PM IST

భారత్​లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు టీకా సరఫరాలో జాప్యం జరగవచ్చని గవీ(గ్లోబల్​ అలయన్స్​ ఫర్​ వ్యాక్సిన్​ అండ్​ ఇమ్యునేషన్​) సీఈఓ సెత్​ బెర్క్​లే అభిప్రాయపడ్డారు. ఆశించిన దాని కన్నా.. తక్కువ టీకాలే భారత్​ నుంచి ఇతర దేశాలకు వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. అమెరికాలోని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్​ ఎక్కువగా టీకాలు సరఫరా చేస్తోంది​. కానీ ప్రస్తుత కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసింది. అంటే.. వాళ్లకు మరిన్ని డోసులు కావాలని, ప్రపంచ దేశాలకు తక్కువ డోసులు సరఫరా అవుతాయని అర్థం."

--- సెత్​ బెర్క్​లే, గవీ సీఈఓ.

మార్చి-ఏప్రిల్​లో 9 కోట్ల డోసులు అందుతాయని భావించామని, కానీ ఆ స్థాయిలో టీకాలు అందకపోవచ్చని పేర్కొన్నారు సెత్​.

"2 బిలియన్​ డోసులను ఆర్డర్​ ఇచ్చాము. వీటిలో ఎక్కువ భాగం ఈ ఏడాది ద్వితీయార్ధానికి కానీ అందుబాటులోకి రావు. అదే సమయంలో.. అగ్ర దేశాలు తమ జనాభా కోసం ఎక్కువ డోసులు వినియోగిస్తున్నాయి. ఇదే పెద్ద సవాలు. మా వద్ద ఎక్కువ డోసులుంటే.. వాటిని అందుబాటులోకి తీసుకురాగలం."

--- సెత్​ బెర్క్​లే, గవీ సీఈఓ

అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు అందించేందుకు ప్రభుత్వ​-ప్రైవేట్​ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమే గవీ. ప్రపంచంలోని 50శాతానికిపైగా మంది చిన్నారులకు గవీ టీకాలు అందిస్తోంది.

ఇదీ చూడండి:- జంతువులకూ కరోనా వ్యాక్సిన్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.