జమ్ముకశ్మీర్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా చూడాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు (Amit Shah News). ఈ ప్రాంత పురోగతి కోసం ఇక్కడి ప్రజలతో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాకిస్థాన్‌తో చర్చలు జరపాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్బుల్లా చేసిన సూచనను ఆయన తోసిపుచ్చారు. కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో (Amit Shah Kashmir Visit) భాగంగా సోమవారం శ్రీనగర్‌లోని ఎస్‌కేఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు అక్కడ ఏర్పాటు చేసిన బుల్లెట్ హ్రఫ్ గ్లాస్ కవచాన్ని అమిత్ షా తొలగించారు. కశ్మీరీ సోదరసోదరీమణులతో నేరుగా మాట్లాడాలని ఉందని తెలిపారు.
"పాకిస్థాన్‌తో చర్చలపై ఫరూక్ అబ్బుల్లా చేసిన సూచనను పత్రికల్లో చదివాను. అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఆయనకు ఉంది. అయితే, కశ్మీరీ సోదరసోదరీమణులతో నేరుగా చర్చలు జరపాలన్నదే మా ఆకాంక్ష. నన్ను తీవ్రంగా విమర్శించారు. శపించారు. అయినా సరే విశాల హృదయంతో, రక్షణ లేకుండా, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేకుండా మీ ముందు నిలుచున్నా."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
కశ్మీర్ , జమ్మూ, లద్దాఖ్ ప్రాంతాలను అఖభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని రద్దు (Amit Shah Kashmir) చేశామని అమిత్ షా చెప్పారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలు 2024కల్లా అందరికీ కనిపిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. వచ్చే ఏడాది చివరికల్లా రూ.50వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడకు వస్తాయని భరోసా వ్యక్తం చేశారు. స్థానికులకు 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
"ప్రధాని మోదీ చొరవతో రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటి ద్వారా ఇప్పుడు 2000 మంది యువకులు వైద్యులవుతారు. వైద్య విద్య చదవడం కోసం ఇక ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లనవసరంలేదు" అని అమిత్ షా అన్నారు.
ఖీర్ భవాని ఆలయ నందర్భన..
కశ్మీరీ పండిట్ల ఆరాధ్య దేవత ఖీర్ భవానీ ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. గందేర్చల్. జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కశ్మీరీ సంప్రదాయ దుస్తులను ధరించారు.
ఇదీ చూడండి: 'గత ప్రభుత్వాలు డబ్బు వేట.. మేము ప్రజల వెంట'