ETV Bharat / bharat

భవానీపుర్​లో దీదీ మ్యాజిక్ పనిచేసేనా? - మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో గెలుపెవరిది

బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపుర్ నియోజకవర్గానికి ఏడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, సుభాష్ చంద్రబోస్, సత్యజిత్ రే వంటి దిగ్గజాల పురిటిగడ్డ అయిన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భాజపా పట్టుదలతో ఉండగా.. పార్టీ అధినేత్రి సొంత స్థానమైన ఈ ప్రాంతంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీఎంసీ భావిస్తోంది. అయితే, ఈ స్థానానికి మమత దూరం కావడం, వరుస ఎన్నికల్లో మెజారిటీ కోల్పోవడం టీఎంసీకి ప్రతికూలంగా మారింది.

Will Mamata Banerjee have the last laugh from Bhabanipore?
దీదీ దూరమైన భవానీపుర్​లో గెలుపెవరిది?
author img

By

Published : Apr 25, 2021, 3:19 PM IST

బంగాల్​లోని నందిగ్రామ్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీ నుంచి వేరువడి భాజపాలో చేరిన సువేందు అధికారిపై పోటీ చేసేందుకు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగప్రవేశం చేయడం, ఆ తర్వాత ఇరువురు నేతలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వాగ్యుద్ధానికి దిగడం.. ఇక్కడి రాజకీయాలను వేడెక్కించింది.

అయితే, ఈ పరిణామాల వెనుక మరుగునపడిన ఓ నియోజకవర్గం ఉంది. అదే... దీదీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపుర్. రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు మమత. ఈ నియోజకవర్గానికి ఏడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. సొంత నియోజకవర్గానికి దీదీ దూరం కావడం.. ఇక్కడి ఫలితాలపై ఏమేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తగ్గుతున్న టీఎంసీ ప్రభావం!

2011లో మమతా బెనర్జీ 49,936 ఓట్ల తేడాతో భవానీపుర్ నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో 63.78 శాతం పోలింగ్ నమోదు కాగా.. దీదీ మెజార్టీనే 21.91 శాతం. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భవానీపుర్​లో టీఎంసీ వ్యతిరేక పవనాలు వీచాయి. దక్షిణ కోల్​కతా లోక్​సభ నియోజకవర్గంలో భాగమైన ఈ భవానీపుర్​లో టీఎంసీ కన్నా భాజపాకు 185 ఓట్లు అధికంగా వచ్చాయి. దక్షిణ కోల్​కతా నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన సౌగతా రాయ్.. 1.36 లక్షల మెజార్టీ దక్కించుకున్నప్పటికీ భవానీపుర్​లో మాత్రం ఫలితం ప్రతికూలంగానే వచ్చింది.

ఆ తర్వాత దిద్దుబాటు చర్యలతో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచే రంగంలోకి దిగారు దీదీ. ఫలితాల్లో విజయం సాధించినా.. మెజారిటీ మాత్రం సగానికి పడిపోయింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్​మున్షీ బరిలోకి దిగగా.. ఆమెపై 26,299 ఓట్ల తేడాతో మమత గెలుపొందారు.

కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 3,168 ఓట్ల ఆధిక్యాన్ని కనబర్చింది టీఎంసీ. కానీ మమత నివాసం ఉన్న వార్డు నెంబర్ 73లో భాజపాపై 496 ఓట్ల తేడాతో వెనకబడింది.

భవానీపుర్​లో గుజరాతీ, మార్వాడీ, సిక్కుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. జనాభాలో మెజారిటీ వాటా వీరిదే. ప్రస్తుతం ఇక్కడి పలు వార్డుల్లో భాజపా చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

టీఎంసీ నేతల మధ్యే పోరు!

ఇప్పుడు మమత ఇక్కడి నుంచి పోటీ చేయకపోయినా.. పార్టీ సీనియర్ నేత శోవన్​దేవ్ ఛటోపాధ్యాయ్​ను రంగంలోకి దించారు. భవానీపుర్ పక్కనే ఉన్న రాశ్​బిహారీ స్థానానికి ప్రస్తుతం శోవన్​దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భాజపా నుంచి నటుడు రుద్రనీల్ ఘోష్ పోటీ చేస్తున్నారు. గతేడాది టీఎంసీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు రుద్రనీల్.

మమత ఇక్కడి నుంచి తప్పుకున్నప్పటికీ భవానీపుర్ అసెంబ్లీ ఎన్నికపై మాత్రం ఆసక్తి తగ్గలేదు. భాజపా సిద్ధాంత కర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ, స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్, దర్శకుడు సత్యజిత్ రే వంటి దిగ్గజాల పురిటిగడ్డ అయిన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భాజపా పట్టుదలతో ఉంది.

ప్రతి ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ కోల్పోతూ వచ్చిన టీఎంసీ.. భవానీపుర్​లో అధికారాన్ని నిలుపుకుంటుందా? లేదా దీదీ సొంత నియోజకవర్గాన్ని కమలదళం తన హస్తగతం చేసుకుంటుందా? అన్నది తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే.

ఇదీ చదవండి-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.