కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు మే 1వ తేదీ నుంచి పరీక్షా కాలం మొదలవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద టీకాలు లేవన్న కారణంతో ప్రజలు మరలిపోతే.. హర్షవర్ధన్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ఒక్క రాష్ట్రం కూడా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకా అందించేందుకు సిద్ధంగా లేదని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
"మే 1 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు పరీక్షా కాలం మొదలవుతుంది. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు పుష్కలంగా ఆయన, ఆయన ప్రభుత్వమూ వాదిస్తోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ అందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. కొవిన్ యాప్ కూడా పనిచేయటం లేదు. మే 1 నుంచి టీకాలు లేవన్న కారణంతో వ్యాక్సినేషన్ కేంద్రాల నుంచి ప్రజలు మరలి వెళ్తే.. ఆరోగ్యమంత్రి రాజీనామా చేస్తారా?
- పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత.
మరోవైపు... వ్యాక్సిన్ తయారీ దారుల నుంచి టీకాలను కేంద్రం పొందుతున్న ధరకే రాష్ట్రాలకు కూడా అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మే1 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ అందించడానికి సిద్ధంగా లేమని తెలిపాయి.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో ఒక్కరోజే 66,159 మందికి కరోనా
ఇదీ చూడండి: హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!