ETV Bharat / bharat

పండగ రోజు ప్రేయసితో భర్త షాపింగ్.. బడితపూజ చేసిన భార్య - तुरब नगर मार्केट

వేరే యువతితో భర్త షాపింగ్ వెళ్లాడని తెలుసుకున్న ఓ భార్య అతడిపై దాడి చేసింది. అందరి ముందే అతడిని చితక్కొట్టింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ జరిగింది.

WIFE THRASHED HUSBAND
భర్తపై భార్య దాడి
author img

By

Published : Oct 13, 2022, 10:27 PM IST

ప్రేయసితో భర్త షాపింగ్​.. ఆవేశంతో ఊగిపోయిన మహిళ.. ఘటనాస్థలిలో అందరిముందు..

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని తురుబ్​ నగర్ మార్కెట్​లో అరుదైన ఘటన జరిగింది. కర్వా చౌత్ పర్వదినాన భార్యతో కాకుండా ప్రియురాలితో షాపింగ్​కు వెళ్లాడు ఓ వ్యక్తి. భర్త వేరే యువతితో షాపింగ్​కు వెళ్లిన విషయం తెలుసుకున్న భార్య కోపంతో ఊగిపోయింది. ఘటనాస్థలికి చేరుకుని అందరూ చూస్తుండగానే భర్త, అతడి ప్రియురాలిపై దాడి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

బాధితురాలికి మద్దతుగా మరికొంత మంది మహిళలు అక్కడికి వచ్చారు. ఈ ఘటన జరిగేటప్పుడు మార్కెట్​లో జనాలు విపరీతంగా గుమిగూడారు. తురుబ్ నగర్​లోని మార్కెట్ హనీమూన్‌లకు ప్రసిద్ధని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడకి మెహందీ పెట్టించుకునేందుకు మహిళలు ఎక్కువగా వస్తారని తెలిపారు. మార్కెట్లో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఘర్షణ సద్దుమణిగేటట్లు చేశారు. అందరినీ పోలీస్ స్టేషన్​కు తరలించారు. ప్రియురాలి కుటుంబ సభ్యులను సైతం పోలీస్ స్టేషన్​కు పిలిపించారు.

ఇవీ చదవండి: న్యూడ్ కాల్స్​తో బురిడీ.. రూ.లక్షలు లాగేసిన కిలేడి.. సాయం చేస్తానని 'పోలీసు' టోకరా

14ఏళ్ల యోగా టీచర్.. ఒకేసారి రెండు పీహెచ్​డీలు.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.