ETV Bharat / bharat

భర్తను చంపి 50మీటర్ల లోతులో పాతిపెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి ఘాతుకం - అక్రమ సంబంధం కోసం భర్తను హత్య చేసిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. భర్తను తాడుతో ఉరేసి చంపి ఏమీ తెలియనట్లుగా భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

husband murdered by wife
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : Dec 1, 2022, 1:50 PM IST

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్తను తాడుతో ఉరేసి చంపిన ఆ మహిళ.. మరుసటి రోజు ఏమీ తెలియనట్లుగా నటించి భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక బెంగళూరు సోలదేవనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో దాసేగౌడ(48), అతని భార్య జయలక్ష్మి నివాసం ఉంటున్నారు. 16 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ ఒక వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నారు. వీరిద్దరికీ తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే జయలక్ష్మికి రాజేశ్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

wife murdered husband
బాధితుడు దాసేగౌడ

భర్త లేని సమయంలో జయలక్ష్మిని ఇంటికొచ్చి కలుస్తూ ఉండేవాడు రాజేశ్​. ఈ విషయం దాసేగౌడకు తెలిసింది. దీంతో భార్యను మందలించాడు. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్న జయలక్ష్మి రాజేశ్​తో కలిసి పన్నాగం వేసింది. డిసెంబర్​ 27 రాత్రి ఇద్దరు కలిసి దాసేగౌడను చంపేశారు. అనంతరం కాళ్లు చేతులను దగ్గరకు లాగి తాళ్లతో కట్టేసి సంచిలో పెట్టారు. కారులో మృతదేహాన్ని తీసుకుని బెంగళూరు- మైసూరు హైవే సమీపంలోని రామనగర వద్దకు చేరుకున్నారు.

wife murdered husband
నిందితుడు రాజేశ్​

అక్కడే ఉన్న కాలువలో మృతదేహాన్ని 50 మీటర్ల లోతులో పాతిపెట్టారు. మృతుడి సెల్​ఫోన్​ను 500 మీటర్ల దూరంలో విసిరేశారు. మరుసటి రోజు జయలక్ష్మి భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మృతుని కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులకు జయలక్ష్మి వివాహేతర సంబంధం గురించి తెలిసింది. అనంతరం రాజేశ్​ను విచారించిన పోలీసులు.. అతడి సెల్​ఫోన్​ ఆధారంగా కేసును చేధించారు. నిందితులను అరెస్ట్​ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.