ETV Bharat / bharat

భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ప్రియుడి కోసమే.. - పంజాబ్​లో అన్నను చంపిన తమ్ముడు

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది ఓ మహిళ. అనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. రెండు నెలల క్రితం ఘటన జరగ్గా.. పోలీసులు విచారణలో తాజాగా నిజం బయటపడింది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. మరోవైపు డ్రగ్స్​కు బానిసైన అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. పంజాబ్​లో ఈ ఘటన జరిగింది.

wife-killed-husband-and-preteneded-it-as-suicide-in-karnataka
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
author img

By

Published : May 20, 2023, 7:32 AM IST

Updated : May 20, 2023, 9:05 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను కడతేర్చింది ఓ భార్య. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. భోజనంలో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి.. సృహ కోల్పోయాక చంపేసింది. ఘటన జరిగిన రెండు నెలల తరువాత నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు. కర్ణాటకలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్​, అనిత భార్యాభర్తలు. బెంగళూరులోని కడుగోడి పోలీస్ స్టేషన్​లో వీరు నివాసం ఉంటున్నారు. కాగా అనితకు హరీశ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి ప్రేమకు భర్త అడ్డువస్తున్నాడని.. ఎలాగైన అతడ్ని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్రపన్నింది అనిత. రెండు నెలల క్రితం భర్త తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపింది.

భార్య పెట్టిన ఆహారం తిన్న ఆనంద్ సృహ కోల్పోయాడు. అనంతరం ఆనంద్​ను రైలు పట్టాలపై పడేయాలని హరీశ్, అనిత భావించారు. కానీ ఆనంద్​ అధిక బరువున్న కారణంగా అలా చేయడం వారికి వీలు కాలేదు. దీంతో ఇంట్లోనే ఆనంద్​ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. తరువాత బాత్​రూంలో పడేసి.. అతని చేతులను కత్తితో కోసేశారు. అనంతరం ఆనంద్​ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని కట్టుకథ సృష్టించి.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్​మార్టం నివేదికలో ఆనంద్​ ఊపిరాడక చనిపోయాడని.. నిద్రమాత్రలు కూడా తీసుకున్నాడని తేలింది. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. మృతుడి భార్య అనితను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నిజాన్ని ఒప్పుకున్న కారణంగా.. ప్రియుడు హరీశ్​, అనితను అరెస్ట్ చేశారు.

అన్నను చంపిన తమ్ముడు..
డ్రగ్స్​కు బానిసైన అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో కత్తితో పొడిచి హత్యచేశాడు. పదే పదే డబ్బులు అడిగి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నందుకు అన్నను హతమార్చాడు. పంజాబ్​లోని మోగా జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్​జీత్ సింగ్, జస్వంత్ సింగ్ అన్నదమ్ములు. రెండు నెలల క్రితమే పెద్దవాడైన సుఖ్​జీత్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. వీరంతా ధరమ్‌కోట్‌ ప్రాంతంలోని లోహ్‌ఘర్ గ్రామానికి చెందిన వారు. కాగా సుఖ్​జీత్ సింగ్ విపరీతంగా డ్రగ్స్​ సేవించేవాడు. డబ్బుల కోసం తమ్ముడు జస్వంత్ సింగ్​ను వేధిస్తుండేవాడు. తల్లిని సైతం తరుచుగా కొడుతుండేవాడు. రెండు నెలల క్రితమే తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో వారు బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.

ఏ పని చేయకుండా వివిధ ప్రాంతాలు తిరిగే సుఖ్​జీత్ సింగ్.. ఐదు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. డ్రగ్స్​ కోసం గురువారం తమ్ముడిని డబ్బులు అడిగాడు. దానికి తమ్ముడు జస్వంత్​ సింగ్​ నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తీవ్ర ఆగ్రాహానికి గురైన జస్వంత్​ సింగ్​.. అన్నను కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి.. నిందుతుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : May 20, 2023, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.