ETV Bharat / bharat

భర్త మర్మాంగం కోసి హత్య.. తల్లి మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి సిమెంట్​తో.. - భర్త మర్మాంగాన్ని కోసి చంపిన భార్య

Wife cuts off genitals kills husband: భర్త మర్మాంగాన్ని కోసి దారుణంగా చంపింది ఓ మహిళ. ఈ క్రూరమైన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

woman cuts off husbands manhood
Wife cuts off genitals kills husband
author img

By

Published : May 17, 2022, 12:23 PM IST

Updated : May 17, 2022, 4:31 PM IST

Wife cuts off genitals kills husband: మహారాష్ట్ర కొల్హాపూర్​లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తాగుబోతు భర్తను అతి కిరాతకంగా మర్మాంగాన్ని కోసి హత్య చేసింది అతడి భార్య. ఈ ఘటన శాహువాడీ తాలూక మాంగుర్వాడిలో జరిగింది. మృతుడిని ప్రకాశ్ పాండురంగ కాంబ్లేగా (52) గుర్తించారు అధికారులు. అతడి భార్య పేరు వందన పాండురంగ్ కాంబ్లే (50). భర్తను చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు నటించింది వందన. చివరకు నేరాన్ని అంగీకరించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ జరిగింది: ప్రకాశ్​, వందన.. ఇద్దరిదీ శాహువాడీలోని లోలనే గ్రామం. కొద్ది నెలలుగా వారు మంగుర్వాడీలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఎప్పుడూ తాగి వచ్చి ఆమెను కొడుతూ ఉండేవాడు ప్రకాశ్. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి అతడిని అతికిరాతకంగా హత్య చేసింది వందన. అతడి తలమీద రాయితో బాది.. మర్మాంగాన్ని కత్తితో కోసింది. ఘటన అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు.

పెళ్లి చేయడం లేదని నాన్నమ్మనే..: మహారాష్ట్రలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తనకు పెళ్లి చేయడం లేదనే ఆగ్రహంతో నానమ్మనే హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన సోలాపుర్​లో చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది: కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో పనిచేస్తున్న సలీమ్​కు పెళ్లి కావడం లేదనే ఆందోళన ఉండేది. సోలాపుర్​లో తన సోదరి వద్ద ఉంటున్న అతడి నాన్నమ్మ మాల్​నబీ సాహబ్​ నదాఫ్ (70).. సలీమ్​ను ఇటీవలే తన వద్దకు​ పిలిపించింది. అక్కడ అతడికి కొన్ని సంబంధాలను చూసినా.. ఏదీ కొలిక్కి రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సలీమ్​.. మే14న సాయంత్రం మాల్​నబీతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకేనా తనను కర్ణాటక నుంచి పిలిపించింది అని ఆగ్రహంలో ఆమె తలపై కర్రతో బాదాడు. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో మరణించింది. సలీమ్​పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని 5రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

కోళ్ల కోసం కూతురినే..: హరియాణాలోని సోనీపత్​లో దారుణం జరిగింది. మే 14న.. కోళ్లకు దాణా పెట్టడం లేదని ఎనిమిదేళ్ల కూతురిని తాళ్లతో కట్టేసి కిరాతకంగా చావబాదాడు ఓ తండ్రి. గాయాల బాధకు తట్టుకోలేక ఆ చిన్నారి మృతిచెందింది. నిందితుడిని అరస్ట్ చేసిన పోలీసులు.. అతడిని రిమాండ్​కు తరలించారు.

అత్తింటివారికి విషం పెట్టి మరో వ్యక్తితో..: ఉత్తర్​ప్రదేశ్​లోని గ్రేటర్​ నొయిడాలో దారుణం జరిగింది. భర్త, అత్త సహా మరుదులకు అన్నంలో విషం పెట్టింది 45 ఏళ్ల మహిళ. అనంతరం తన ఐదుగురు పిల్లలతో కలిసి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో పారిపోయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

డ్రమ్ములో పెట్టి సిమెంటుతో.. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి సిమెంట్​తో పూడ్చేసిన ఘటన చెన్నైలోని నీలంగరాయ్​ ప్రాంతంలో వెలుగుచూసింది. మృతురాలిని.. 86 ఏళ్ల శెంబగమ్​గా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని డ్రమ్ము నుంచి వెలికితీయడం సాధ్యం కాకపోవడం వల్ల డ్రమ్ముతో సహా శవాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సురేశ్​, బాబు సోదరులు. మతిస్థిమితం లేని సురేశ్​ తన తల్లితో పాటే నివసిస్తుండగా.. సోదరుడు బాబు వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే గతకొన్ని రోజులుగా సురేశ్​ తల్లి శెంబగమ్ కనిపించకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సురేశ్​ను ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. దీంతో ఓ రోజు సోదరుడు బాబు సురేశ్​ ఇంటికి వచ్చి ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బాబు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. అనారోగ్యం కారణంగా తన తల్లి కొద్ది రోజుల ముందే చనిపోయిందని.. ఆమె శవాన్ని డ్రమ్ములో పెట్టి సిమెంటుతో పూడ్చేశానని చెప్పుకొచ్చాడు సురేశ్.

ఇదీ చూడండి: జైలులో అసహజ శృంగారం.. 20 ఏళ్ల యువకుడిపై టీనేజర్​..

Last Updated : May 17, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.