ETV Bharat / bharat

కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు? - పూర్వీకులు చెప్పిన మాట నిజమేనా? - Kanuma Importance in Telugu

Kanuma Festival 2024 : సంక్రాంతి పండగలో భాగంగా మూడో రోజు కనుమను జరుపుకుంటాం. అయితే పండక్కి సొంతూర్లకి, బంధువుల ఇంటికి వెళ్లిన వారు రకరకాల కారణాలతో కనుమ రోజే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ టైమ్​లో చాలా మంది కనుమ రోజు ప్రయాణం చేయకూడదని అంటుంటారు. నిజానికి ఆ రోజు జర్నీ చేయొద్దా? చేస్తే ఏమవుతుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

Kanuma Festival 2024
Kanuma Festival 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 2:05 PM IST

Updated : Jan 16, 2024, 6:02 AM IST

Why Should Not Travel on Kanuma Day : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండగలలో ఒకటి సంక్రాంతి. మూడు రోజుల పాటు కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో తెలుగు లోగిళ్లు సందడిగా మారతాయి. పల్లెల్లన్నీ పండగ వాతావరణాన్ని నింపుకుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పండగలో భాగంగా మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి(Sankranti 2024), మూడో రోజు కనుమ జరుపుకుంటారు. ఈ కనుమనే పశువుల పండగ అంటారు. పంట చేతికి రావడానికి తమకు ఏడాదంతా చేదోడుగా ఉన్న పాడి పశువులను ఈ రోజు ప్రత్యేకంగా అలంకరించి మంచి ఆహారం అందించి పూజిస్తారు. అదేవిధంగా పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షుల కోసం కూడా ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను కడతారు. అయితే, 'కనుమ నాడు కాకులు కూడా కదలవు' అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. అసలు ఈ సంప్రదాయ నియమం వెనుక ఉద్దేశాలు ఏంటి? నిజంగా కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దా? చేస్తే ఏమవుతుందని? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Kanuma Importance : పూర్వ కాలంలో కనుమ నాడు జర్నీ చేయకూడదంటూ పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యం కూడా దాగి ఉంది. నిజానికి పూర్వం మన పెద్దవాళ్లు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఎడ్ల బండ్లను యూజ్ చేసేవారు. అయితే మూడు రోజుల సంక్రాంతి పండగలో భాగంగా కనుమ నాడు ఎడ్లను ప్రత్యేకంగా పూజిస్తారు గనక వాటిని ఆ ఒక్కరోజైనా కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో ఎడ్ల బండ్లు కట్టకుండా చూసేందుకు కనుమ రోజు ప్రయాణం వద్దని చెప్పేవారు. అందుకే నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండగని భావిస్తారు. అదేవిధంగా మనిషి జీవితంలో పశు పక్ష్యాదులకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిపే పండగగా ఆ రోజును పరిగణిస్తారు.

సంక్రాంతి- నాలుగు రోజుల పండగంట! మీకు తెలుసా మరి?

కనుమ రోజు జర్నీ ఎందుకు చేయకూడదంటే.. ఇక సంక్రాంతితో ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. పూర్వీకులు ఇది దేవతలకు చాలా ఇష్టమైన సమయమని చెబుతుంటారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. అదేవిధంగా చనిపోయిన పెద్దలు కూడా కనుమ రోజున బయటకు వస్తారనీ.. వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. అందుకే కనుమ రోజున పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్లు కూడా తినేందుకు ప్రత్యేకంగా నాన్​వెజ్ వంటలు చేసుకుంటారు. ఇక కనుమ నాడు మినుములు తింటే మంచిది అన్న ఉద్దేశంతో ఈ రోజు గారెలు చేసి నాన్​వెజ్​తో చేసిన వంటకాలు వడ్డిస్తారు. చలికాలంలో వేడిని పెంచేందుకూ ఈ మినుములు ఎంతో ఉపయోగపడతాయి.

జర్నీ చేస్తే ఏమవుతుంది? : పెద్దల కోసం విందు భోజనం రెడీ చేయడమే కాదు.. కుటుంబం మొత్తం కలిసి తినాలనే నియమం కూడా కనుమ రోజుకు ఉంది. అందుకే ఈ కనుమ వేడుకను అక్కా చెల్లెల్లు- అల్లుళ్లతో కలిసి కుటుంబమంతా ఉత్సాహంగా జరుపుకొంటారు. దీంతో కనుమ రోజున ఇంట్లో మొత్తం ఎంతో హడావుడి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆగి.. పెద్దలను తలచుకోవాలనీ.. బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించాలని కొందరు చెబుతుంటారు. ఇక అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదనీ.. ఒకవేళ కాదు, కూడదు అంటూ ప్రయాణిస్తే ఆటంకాలు తప్పవంటూ పూర్వీకుల చెప్పిన ఈ మాట కూడా వ్యాప్తిలో ఉంది.

సంక్రాంతి రోజు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? పురాణాలు ఏం చెబుతున్నాయి?

సంక్రాంతికి నాటుకోడి పులుసు ఇలా ట్రై చేయండి - ఇంటికి వచ్చిన వారంతా లొట్టులేసుకుంటారు!

Last Updated : Jan 16, 2024, 6:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.