కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అని మోదీ పలుమార్లు అనడాన్ని తప్పుపట్టారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. భాజపా, వామపక్షాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయని అన్నారు.
"ఎక్కడికెళ్లినా ప్రధాని మోదీ 'కాంగ్రెస్ ముక్త్ భారత్'(కాంగ్రెస్ లేని భారతదేశం) అని నినదిస్తున్నారు. నిద్రలేచినప్పుడు, పడుకునేముందు కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే అంటున్నారు. సీపీఎం ముక్త్ భారత్ అని ఎందుకు అనరు?"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
వామపక్షాలతో మోదీకి సమస్యేం లేదని, అయన సమస్యంతా కాంగ్రెస్ పార్టీతోనే అని అన్నారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్, వామపక్షాల భావజాలం ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్.. ప్రజలందరినీ ఏకం చేస్తుందని అన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేవారితోనే తమకు ముప్పు ఉందని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి: బీజాపుర్‌లో ఎన్కౌంటర్- జవాను మృతి