ETV Bharat / bharat

'బూస్టర్​ డోసులు సరిపోవు.. వ్యాక్సిన్లను అప్డేట్ చేయాలి' - covid vaccine latest news

WHO on booster dose: ఒమిక్రాన్​ వ్యాప్తి దావానంలా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా టీకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న బుస్టర్​ డోసులు సరిపోవని, వ్యాక్సిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. భవిష్యత్​లో ఏ రకం వేరియంట్ వచ్చినా ప్రభావం చూపేలా అవి ఉండాలని పేర్కొంది.

Booster doses of current vaccines may not be enough: WHO
బూస్టర్​ డోసులు సరిపోవు
author img

By

Published : Jan 12, 2022, 10:25 AM IST

WHO on booster dose: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లకు మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అభిప్రాయపడింది. ఇవి కరోనా వైరస్​నుంచి రక్షణ కల్పించి, తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో రాబోయే కొత్త వేరియంట్లను ఏ మేరకు నిలువరిస్తాయో తెలియదని పేర్కొంది. అందుకే ఏ వేరియంట్​ వచ్చినా ప్రభావవంతంగా పనిచేసేలా వ్యాక్సిన్లకు మార్పులు చేయడమో, కొత్త టీకాలను అభివృద్ధి చేయడమో జరగాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు WHO సాంకేతిక సలహా సంఘం మంగళారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 18మంది నిపుణులు ఉన్నారు.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఉన్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాయి. ఆందోళనకర వేరియంట్​ల నుంచి కూడా మరణం ముప్పు లేకుండా కాపాడుతున్నాయి. అయితే తరచూ బూస్టర్​ డోసులు తీసుకోవాలనే వ్యాక్సినేషన్​ వ్యూహం సరైనది, స్థిరమైనది కాదు. ప్రపంచమంతా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్​ బారినపడిన వారిలో వ్యాధి లక్షణాలు లేకుండా టీకాలు నిలువరించలేకపోతున్నాయి. అందుకే వీటిని అప్డేట్​ చేయాల్సిన అవసరం ఉంది. ఏ వేరియంట్ వచ్చినా ప్రభావం చూపే విధంగా టీకాలను అభివృద్ది చేయాలి. దీర్ఘకాలిక రక్షణ కల్పించేలా అవి ఉండాలి.

-ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా సంఘం

Read: Experts caution against 'overuse' of vaccine

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.