ETV Bharat / bharat

ఎవరీ అపర్ణా యాదవ్​- భాజపాలో చేరికతో ఎవరికి లాభం? - Akhilesh Yadav

Aparna Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరదలు అపర్ణా యాదవ్‌ బుధవారం.. భాజపాలో చేరారు. అపర్ణ చేరికతో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయనేది పక్కనబెడితే.. రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ అయిన భాజపాలో చేరడమనేది ఎన్నికల వేళ పెద్ద మార్పే అని చెప్పాలి. ఇంతకీ ఎవరీ అపర్ణా యాదవ్‌ అంటే..!

aaparna-yadav
aaparna-yadav
author img

By

Published : Jan 20, 2022, 9:00 AM IST

Updated : Jan 20, 2022, 9:24 AM IST

Aparna Yadav: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్​వాదీ పార్టీకి షాక్​ తగిలింది. సమాజ్​వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరారు. గతకొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ భాజపాలో చేరడం ఎన్నికల సమయంలో పెద్ద మార్పే అని చెప్పాలి. ఇంతకీ అపర్ణా యాదవ్‌ ఎవరు?

aaparna-yadav
ములాయంతో అపర్ణా యాదవ్​

ములాయం సింగ్‌ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ను అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మాజీ జర్నలిస్టు కుమార్తె అయిన అపర్ణ.. లఖ్‌నవూలో డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ పాలిటిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అపర్ణ క్లాసికల్‌ సింగర్‌. జంతు ప్రేమికురాలు కూడా. 'బి అవేర్‌' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. జంతు సంరక్షణతో పాటు మహిళల భద్రతపైనా పనిచేస్తున్నారు.

aaparna-yadav
అపర్ణ

ఐదేళ్ల కిందటే రాజకీయ అరంగేట్రం..

అపర్ణ భర్త ప్రతీక్‌ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించరు. సమాజ్‌వాదీ పార్టీ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కానీ అపర్ణ రాజకీయాలంటే ఆసక్తితో 2017లోనే అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున లఖ్‌నవూ కంటోన్మెంట్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 22వ వ్యక్తి ఈమె. అయితే ఆ ఎన్నికల్లో భాజపా నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో 34వేల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. తొలి ఎన్నికల్లోనే ఓటమిపాలైనా.. నిరాశ చెందకుండా రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగానే ఉంటున్నారు.

aaparna-yadav
ములాయం కుటుంబంతో అపర్ణా యాదవ్​

మోదీ, యోగిపై ప్రశంసలు..

అయితే, గత కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వివిధ సందర్భాల్లో అపర్ణ ప్రశంసలు కురిపించారు. ఎన్​ఆర్​సీ, ఆర్టికల్‌ 370 రద్దును సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తే.. అపర్ణ సమర్థించడం గమనార్హం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆమె రూ.11లక్షల విరాళంగా ఇచ్చారు. యోగి ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కూడా కల్పించింది. ఈ క్రమంలోనే ఆమె భాజపాలో చేరనున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలను అఖిలేశ్‌ గతంలో ఖండించారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని చెప్పుకొచ్చారు. కానీ, ఆ ఊహాగానాలను నిజం చేస్తూ అపర్ణ బుధవారం భాజపాలో చేరారు.

aaparna-yadav
అపర్ణా యాదవ్​

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌..

అపర్ణ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సేవా కార్యక్రమాలు, చర్చా వేదికల్లో పాల్గొంటూ ఆ చిత్రాలను పోస్ట్‌ చేస్తుంటారు. ప్రతీక్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య కుటుంబపరంగా విభేదాలు ఉన్నప్పటికీ ములాయం కుటుంబంతో అపర్ణకు మంచి సాన్నిహిత్యం ఉంది. తరచూ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను షేర్​ చేస్తుంటారు.

aaparna-yadav
సీఎం యోగి ఆదిత్యనాథ్​, భాజపా అధ్యక్షుడు నడ్డాతో అపర్ణా యాదవ్​

గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు భాజపా నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణ చేరిక భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏదేమైనా చోటీ బహు.. పెద్ద మార్పే తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

UP Assembly Elections: యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో పోలింగ్​ నిర్వహించనున్న ఈసీ.. మార్చి 10న ఫలితాలు వెలువరించనుంది.

ఇవీ చూడండి: సమాజ్​వాదీకి షాక్​.. భాజపాలో చేరిన ములాయం కోడలు

మాయావతి 'నామమాత్రపు' పోటీ- మరి దళితుల మద్దతు ఎవరికి?

అప్నాదళ్​, నిషాద్​ పార్టీతో భాజపా పొత్తు.. ఆ వర్గాల ఓట్లపైనే ఆశలు!

Last Updated : Jan 20, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.