ETV Bharat / bharat

'వ్యాక్సిన్​ తీసుకుంటే వారికి మరింత రక్షణ' - ఐసీఎంఆర్​ అధ్యయనం

కొవిడ్ నుంచి కోలుకుని ఒకటి/రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా 'డెల్టా రకం' వైరస్(Delta variant) నుంచి ఎక్కువ రక్షణ పొందుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్(Covid virus) నుంచి కోలుకున్నవారు కనీసం ఒక్క డోసు తీసుకున్నా.. వారిలో సహజంగానే ఎక్కువ యాంటీబాడీలు ఉండటం వల్ల మరోసారి ఇన్​ఫెక్షన్​ బారిన పడటం నుంచి, అలాగే కొత్తగా వస్తున్న వైరస్ రకాల (వేరియంట్ల) నుంచి రక్షణ పొందుతున్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది.

vaccine after recovering covid
కోలుకున్నవారికి కొవిడ్​ టీకా
author img

By

Published : Jul 4, 2021, 7:06 AM IST

ఒకటి లేదా రెండు డోసుల కొవిషీల్డ్(Covishield) టీకా తీసుకున్నవారితో పోలిస్తే.. కొవిడ్(Covid-19) నుంచి కోలుకుని ఒకటి/రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా 'డెల్టా రకం' వైరస్(Delta variant) నుంచి ఎక్కువ రక్షణ పొందుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ, కమాండ్ ఆసుపత్రి డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ, సైనిక దళాల వైద్య కళాశాల శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిషీల్డ్ టీకా ఒక డోసు, రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక స్పందనను ఈ సందర్భంగా మదింపు చేశారు.

టీకా పొందినవారికి ఇన్​ఫెక్షన్​ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా రకం నుంచి రక్షణ కల్పించడంలో హ్యూమరల్, సెల్యులర్ రోగనిరోధక స్పందనలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు కనీసం ఒక్క డోసు తీసుకున్నా.. వారిలో సహజంగానే ఎక్కువ యాంటీబాడీలు ఉండటం వల్ల మరోసారి ఇన్​ఫెక్షన్​ బారిన పడటం నుంచి, అలాగే కొత్తగా వస్తున్న వైరస్ రకాల (Variant) నుంచి రక్షణ పొందుతున్నట్లు అధ్యయనం పేర్కొంది.

భారత్​లో వ్యాక్సినేషన్ క్రమం భేష్..

భారత్​లో ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన వ్యాక్సినేషన్ ఫలితంగా కొవిడ్-19 వ్యాధి తీవ్రత, మరణం ముప్పు తగ్గినట్లు ఓ గణిత నమూనా ఆధారంగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. తొలుత ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్ వర్కర్లకు.. తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి.. అనంతరం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న 24-60 ఏళ్ల వారికి.. ఇలా వ్యాక్సినేషన్ చేపట్టడం కొవిడ్ కట్టడిలో విశేష ప్రభావం చూపించినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను ఐసీఎంఆర్ వెల్లడించింది. భారత్​లో కొవిడ్ వ్యాక్సినేషన్ విధానం: గణిత నమూనా ఆధారిత విశ్లేషణ పేరిట ఈ అధ్యయనాన్ని ఐసీఎంఆర్‌కు చెందిన సందీప్ మండల్, బలరాం భార్గవ, సమీరన్ పాండాలతో పాటు లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన నిమలన్ అరిణామినిన్​పతి చేపట్టారు. "ప్రాధాన్య గ్రూపుల క్రమంలో వ్యాక్సినేషన్ చేయడం ప్రజారోగ్యంపై ఒత్తిడిని తగ్గించింది" అని అధ్యయనం పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఆ టీకాలతో మరణం నుంచి 98 శాతం రక్షణ'

ఇదీ చూడండి: భారత్​లో ఇక నుంచి గర్భిణులకు టీకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.