ETV Bharat / bharat

కూనిరాగాలే ఆ గ్రామస్థుల పేర్లు.. 'విజ్లింగ్​ విలేజ్ ఆఫ్​ ఇండియా' కథ తెలుసా? - విజిల్ విలేజ్ మేఘాలయ

సాధారణంగా పిల్లలకు పేర్లు పెట్టాలంటే.. పుట్టిన సమయం, తేదీ, నక్షత్రం అంటూ సవాలక్ష అంశాలు పరిశీలిస్తారు తల్లిదండ్రులు. కొందరు ఇంట్లో పెద్దవాళ్ల పేరును, మరికొందరు దేవుళ్ల పేరును పెడుతుంటారు. అయితే మేఘాలయలోని ఓ గ్రామంలో కూని రాగాలనే వారి పిల్లలకు పేర్లుగా పెడుతుంటారు అక్కడి తల్లిదండ్రులు. మరి ఆ ప్రాంతం గురించి ఓ తెలుసుకుందామా?

whistling village
విజిల్ విలేజ్
author img

By

Published : Feb 21, 2023, 4:10 PM IST

కూనిరాగాలే ఆ గ్రామస్థుల పేర్లు.. 'విజ్లింగ్​ విలేజ్ ఆఫ్​ ఇండియా' కథ తెలుసా?

ఇదేంటి వీరందరూ కూనిరాగాలు తీస్తున్నారు అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదండీ.. వీరు తమ బంధువుల్ని, స్నేహితుల్ని పిలుస్తున్నారు. వారి పేర్లు అవే మరి! ఏంటి పేర్లు ఇలా వింతగా ఉన్నాయని అనుకుంటున్నారా? మేఘాలయలోని కాంగ్​థాంగ్​ గ్రామం ప్రత్యేకత అదే.

మేఘాలయలోని కాంగ్​థాంగ్ గ్రామంలో అక్కడి వారికి మనలాగా పేర్లు ఉండవు. మరి ఎలా పిలుచుకుంటారు అని ఆలోచిస్తున్నారు కదూ!! కూని రాగాలతోనే ఒకరిని ఒకరు పిలుచుకుంటారు. ఎందుకంటే అది వారి ఆచారం .. పూర్వీకుల నుంచి ఆ సంప్రదాయం ఉందని కాంగ్​థాంగ్ గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే ఆ గ్రామాన్ని 'విజిల్ విలేజ్' అని పిలుస్తున్నారు.

గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి పేరు మీద ఉన్న కూనిరాగం కూడా మరణించినట్లే. విజిల్ సిటీ ఆఫ్ ఇండియాగా మా గ్రామాన్ని పిలుస్తారు. మా గ్రామంలో మొత్తం 700 మంది జనాభా ఉన్నారు.

--పిస్తావర్​ కొంగ్శిత్​, కాంగ్​థాంగ్​ గ్రామస్థుడు

కాంగ్​థాంగ్​ గ్రామంలో పుట్టిన వారికి ఈల శబ్దం, పక్షుల అరుపులు లేదా సినిమా పాటల్లోని ట్యూన్‌ ఆధారంగా పేర్లు పెడుతుంటారు. అందరి పేర్లు వేర్వేరుగా.. పదాలు రాకుండా రాగాలతోనే 30 సెకన్లు ఉండేలా చూస్తారు. ఇంట్లో ఉండే సమయంలో మొత్తం పేరు కాకుండా మొదటి ఆరు సెకన్లు, బయట ఉంటే పూర్తి రాగంతో పిలుస్తారు. అడవిలో ఎవరైనా చిక్కుకుపోతే.. తమ పేరును.. అదే కూనిరాగాన్ని గట్టిగా పాడతారట. అది విని ఊళ్లో వాళ్లు వెళ్లి ప్రమాదంలో ఉన్నవారికి సహాయపడతారు. కాంగ్​థాంగ్ గ్రామంలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు.

whistling village
కాంగ్​థాంగ్ గ్రామస్థులు

అసోంలో ఓ గ్రామంలో కూనిరాగంతో పేరును పిలిచేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. మా గ్రామస్థులలాగే విజిల్​తో పేరును పిలిచేందుకు వారు కూడా ప్రయత్నిస్తున్నారు. పిల్లలు పుట్టగానే ఓ ట్యూన్​ను అతడి తల్లి సిద్ధం చేస్తుంది.

--జిప్సన్ సోక్లేట్, కాంగ్​థాంగ్ గ్రామస్థుడు

తల్లి, తండ్రి వేర్వేరుగా..
పుట్టిన బిడ్డకు పేరు పెట్టేందుకు పెద్దలు భారీగా ఆలోచిస్తారు. తల్లి, తండ్రి వేర్వేరుగా కొన్ని రాగాలను కూరుస్తారు. అంతా కలిసి వాటిలో ఏది బాగుంటే దాన్ని ఎంపిక చేస్తారట. మనం స్నేహితులు, బంధువుల పేర్లను గుర్తుపెట్టుకున్నట్లే.. ఇక్కడి ప్రజలు రాగాలను గుర్తుపెట్టుకుంటారు. ఇలా రాగాలతో పేర్లు పెట్టే పద్ధతిని 'జిగవా యోబి' అని అంటారు. అంటే, అక్కడి వారి భాషలో "అమ్మ ప్రేమ" అని అర్థమట. ఇప్పుడు పుట్టే పిల్లలకు మాత్రం పాఠశాలలో రికార్డుల కోసం మామూలు పేర్లు పెడుతున్నా.. ఊళ్లో మాత్రం కూనిరాగాలతోనే పిలుస్తారు.

whistling village
కాంగ్​థాంగ్ గ్రామం

గతేడాది ప్రపంచ పర్యటక సంస్థ.. ఉత్తమ గ్రామంగా కాంగ్​థాంగ్ సహా మరో రెండు గ్రామాలను ఎంపిక చేసింది. 2019లో కాంగ్​థాంగ్ గ్రామాన్ని బిహార్​కు చెందిన రాజ్యసభ ఎంపీ రాకేశ్​ సిన్హా దత్తత తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.