WFH Legal framework: ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోండబ్ల్యూఎఫ్‌హెచ్)కి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ తరహా పని ఇంతవరకు ప్రధానంగా సేవల రంగానికే పరిమితం కాగా ఇకపై అన్ని రంగాలకూ వర్తించేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి పని విధానం వల్ల భాగస్వాములకు కలిగే ప్రయోజనాలను, కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి పనిని ఏయే రంగాలకు విస్తరింపజేయవచ్చో ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల విషయంలో యాజమాన్యాలు ఎలా మెలగాలనేది ఈ సంస్థ సూచిస్తుంది. ఉద్యోగులకు పని గంటల నిర్ణయం, ఇంటి నుంచి పనిచేసేటప్పుడు విద్యుత్తు/ ఇంటర్నెట్ వినియోగానికయ్యే అదనపు ఖర్చుల్ని తిరిగి చెల్లించేలా చూడడం వంటివి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఉద్యోగుల్ని కరోనా వైరస్ బారి నుంచి రక్షించుకునేందుకు డబ్ల్యూఎఫ్‌హెచ్‌ను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: యువకుడి పొట్టలో 21 మేకులు- అవాక్కయిన వైద్యులు!