ETV Bharat / bharat

బంగాల్​లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా?

బంగాల్​లో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాజకీయ వేడి రాజుకుంది. హింసాత్మక ఘటనలతో అధికార తృణమూల్ కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. వచ్చే ఐదేళ్ల పాటు బంగాల్​ రాజకీయం అత్యంత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Suvendu, Mamata
సువేందు, మమత
author img

By

Published : May 9, 2021, 5:58 PM IST

Updated : May 9, 2021, 8:04 PM IST

  • ఎన్నికల ఫలితాల రోజే రాజకీయ హింస
  • వేర్వేరు పార్టీల కార్యకర్తలు హత్య
  • అధికార, విపక్షాల మాటల తూటాలు
  • రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్​లు
  • కేంద్రం కమిటీలు- మోదీకి మమత లేఖాస్త్రాలు

మే 2 నుంచి బంగాల్​లో జరుగుతున్న పరిణామాలివి. ప్రచార పర్వం, పోలింగ్, ఓట్ల లెక్కింపు... ఇలా అన్నీ పూర్తయినా రాజకీయ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. 'బంగాల్​ దంగల్'​లో విజేత ఎవరో తేలి వారం అయినా... తృణమూల్ కాంగ్రెస్​, భారతీయ జనతా పార్టీ అంతకంతకూ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి. తొలి వారమే ఇలా ఉంటే... రానున్న ఐదేళ్లు బంగాల్​ రాజకీయం ఎలా సాగనుంది? టీఎంసీ, భాజపా మధ్య పోరు... హైఓల్టేజ్​ పొలిటికల్ యాక్షన్ సినిమాను తలపించడం ఖాయమా?

బలమైన అధికార పక్షం వర్సెస్​ బలమైన ప్రతిపక్షం

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ 213 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని చేపట్టింది. మరోవైపు.. 2016 ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన భాజపా.. అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారిని ప్రతిపక్ష నేతగా నియమించాలని భావిస్తోంది భాజపా అధిష్ఠానం.

రాజకీయ హింస..

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయ హింస పెరిగిపోయింది. దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్​పుర్​ ప్రాంతంలో హరణ్​ అధికారి అనే భాజపా కార్యకర్త హత్యకు గురయ్యాడు. టీఎంసీ కార్యకర్తలే ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోల్​కతాలోని బెలెఘటాలో మరో భాజపా కార్యకర్తను దుండగులు హత్యచేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా దత్తాపుకర్​లో దుండగులు జరిపిన బాంబు దాడిలో ఐఎల్​ఎఫ్​ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇది టీఎంసీ​ నేతల పనే అని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పరస్పర ఆరోపణలు

తృణమూల్​ కాంగ్రెస్ దాడుల్లో.. తమ పార్టీ కార్యకర్తలు ఆరుగురు మృత్యువాతపడ్డారని, పలువురు గాయపడ్డారని భాజపా ఆరోపించింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారని పేర్కొంది. ఘర్షణలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో భాజపా పలు వీడియోలను షేర్ చేసింది. నందిగ్రామ్​లో తమ కార్యాలయంపై దాడి అనంతరం చెల్లాచెదురుగా పడి ఉన్న పోస్టర్లు, పత్రాలు, ధ్వంసమైన సామగ్రి వంటివి ఆ వీడియోల్లో ఉన్నాయి. సుమారు నాలుగు వేల మంది భాజపా మద్దతుదార్ల ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపింది. అధికార పార్టీ రాజకీయ హింసకు పాల్పడుతోందని ఆరోపించింది. బంగాల్​లో రాజకీయ హింస చెలరేగిన క్రమంలో రాష్ట్రపతి పాలన విధించాలని పలువురు కేంద్ర మంత్రులు, నేతలు కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. మే 2న జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 16 మంది తమ కార్యకర్తలు మరణించారని తృణమూల్ కాంగ్రెస్​ తెలిపింది. భాజపానే కారణంగా పేర్కొంది. బాధితుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో హింసకు కేంద్ర మంత్రులు ఉసిగొల్పుతున్నారంటూ మమత వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చి ఇంకా 24 గంటలు కాకముందే లేఖలు, కేంద్ర బృందాలు రాక వంటివి జరిగిపోతున్నాయని అన్నారు. ప్రజల తీర్పును భాజపా స్వాగతించటం నేర్చుకోవాలని సూచించారు.

నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ..

ఫలితాలు వెల్లడైన తర్వాత హింసాత్మక ఘటనలు జరగటంపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్​ను ఆదేశించింది. ఘర్షణలపై గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​ .. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో సమీక్ష నిర్వహించారు. శాంతి నెలకొనేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని గవర్నర్​ జగదీప్​ ధనకర్​ వెల్లడించారు. హింస ఘటనలపై ఫోన్​లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. వివేకంలేని రాజకీయ హింస ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకని ప్రశ్నించారు.

బంగాల్​లో హింసపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు భాజపా నేత గౌరవ్​ భాటియా.

ప్రమాణ స్వీకారం వేదికగా గవర్నర్​ సెటైర్లు..

మే 5న బంగాల్​ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీతో ప్రమాణం చేయించారు గవర్నర్​ జగదీప్​ ధనకర్. ఈ కార్యక్రమం అనంతరం మమతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్​. ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసను ఆపేలా సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు.

నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై కేంద్రం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ బృంద సభ్యులు మే 6న రాష్ట్రంలో పర్యటించారు. గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​తో పాటు, రాష్ట్ర సీఎస్​, హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో సమావేశమయ్యారు. హింస జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక సమర్పించారు.

దీదీ లేఖాస్త్రాలు..

రాజకీయ హింసే ప్రధానాంశంగా భాజపా విమర్శలు గుప్పిస్తున్నా... మమత వైఖరి మరోలా ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమకు కరోనా మహమ్మారిని కట్టడి చేయటమే తొలి ప్రాధాన్యమని ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానికి వరుస లేఖలు సంధిస్తున్నారు. కరోనా టీకా ఉచితంగా అందించాలని, టీకా పంపిణీ పారదర్శకంగా సాగేలా చూడాలని, రెమ్​డెసివిర్ సహా ఇతర కీలక ఔషధాలను అవసరాలకు సరిపడా సమకూర్చాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

కేంద్ర స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా... ఎన్నికలు పూర్తయ్యాక కనీసం కొంత కాలమైనా రాజకీయం స్తబ్దుగా ఉండడం సహజం. కానీ బంగాల్​లో మాత్రం అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. ఈ పరిణామాలు మున్ముందు ఇంకెలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

ఇదీ చూడండి: బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సువేందు!

Last Updated : May 9, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.