ETV Bharat / bharat

దీదీకి మరో షాక్- భాజపాలోకి మరో మంత్రి, ఎమ్మెల్యే - మమతా బెనర్జీ

అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు భాజపాలో చేరుతున్నారు. తాజాగా తృణమూల్​ మంత్రి బచ్చు హన్స్​దా, ఎమ్మెల్యే గౌరీ శంకర్​ దత్తా భాజపాలో చేరారు.

West Bengal
మమతకు మరో షాక్​.. భాజపాలో చేరిన మంత్రి, ఎమ్మెల్యే
author img

By

Published : Mar 10, 2021, 6:06 PM IST

అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తృణమూల్​ కాంగ్రెస్​ మంత్రి బచ్చు హన్స్​దా, ఎమ్మెల్యే గౌరీ శంకర్​ దత్తా​.. బుధవారం భాజపాలో చేరారు. వీరిద్దరికీ తృణమూల్​ కాంగ్రెస్ టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో పార్టీ మారారు.

West Bengal
భాజపాలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే గౌరీ శంకర్​ దత్తా

తపన్​ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి హన్స్​దా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తృణమూల్​ కాంగ్రెస్​లో గౌరీ శంకర్​ దత్తా సీనియర్​ నేత. తెహత్తా నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

West Bengal
భాజపాలో చేరిన నటి రాజశ్రీ రాజ్​భన్షీ
West Bengal
భాజపాలో చేరిన బెంగాలీ నటుడుబోనీ సేన్​గుప్తా

అటు భాజపాలో బంగాలీ నటుల చేరికలూ ఊపందుకున్నాయి. ఇటీవల బంగాల్​ అగ్రనటుడు మిథున్​ చక్రవర్తి భాజపాలో చేరగా.. బుధవారం నటుడు బోనీ సేన్​గుప్తా, నటి రాజశ్రీ రాజ్​భన్షీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఇదీ చూడండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.