ETV Bharat / bharat

చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా! - భార్య చేయి నరికి భర్త

భర్త చేసిన దాడిలో కుడి చేయి కోల్పోయి చికిత్స పొందుతున్న రేణు ఖాతున్​కు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భరోసా కల్పించారు. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

Renu Khatun
రేణు ఖాతున్
author img

By

Published : Jun 9, 2022, 4:47 PM IST

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ భర్త.. తన భార్య చేయి నరికేసిన సంఘటన ఇటీవల బంగాల్​లో సంచలనంగా మారింది. కుడి చేయి లేదని నిరాశ చెందని రేణు ఖాతున్(23)​.. నర్సు ఉద్యోగం కోసం ఎడమ చేతితో రాయటం సాధన మొదలు పెట్టింది. తాజాగా ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ఆమె వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

"తూర్పు బుర్ద్వాన్​ జిల్లాలోని కేతుగ్రామ్​కు చెందిన బాధితురాలు రేణు ఖాతున్​.. నర్సు ఉద్యోగానికి ఎంపికైంది. ఇప్పుడు ఆమె కుడి చేతిని కోల్పోయింది. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తాం. రేణు ఖాతున్​ చికిత్సను చీఫ్​ సెక్రెటరీ హెచ్​కే ద్వివేదీ పర్యవేక్షిస్తారు. బాధితురాలికి కృత్రిమ చేయి అందించేందుకు కృషి చేస్తాం. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

ఆసుపత్రికి వచ్చి తనను పరామర్శించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు రేణు. బిడ్డ కోసం ఒక తల్లిలా.. ఈరోజు తనకు మద్దతుగా నిలిచారని కొనియాడారు. తనను ఈ విధంగా మార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. రేణు ప్రస్తుతం దుర్గాపుర్​ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డు ఉన్నప్పటికీ వైద్యం కోసం ఆమె కుటుంబం రూ.57వేలు వెచ్చించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమత.. వైద్య ఖర్చులు చెల్లించాలని చీఫ్​ సెక్రెటరీకి సూచించారు.

అత్తవారింటి కుటుంబ సభ్యురాలిగా రేణు పేరు నమోదైందని, అందువల్ల ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె సోదరుడు రిపొన్​ షేక్​. మరోవైపు.. రేణు ఖాతున్​ భర్త షరిఫుల్​ షేక్​తో పాటు ఈ సంఘటనకు సంబంధం ఉన్న అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేసినట్లు ఎస్​డీపీఓ కౌశిక్​ బసక్​ తెలిపారు.

ఇదీ చూడండి: ''కుడి చేయి నరికేస్తే ఏంటి? ఎడమ చేయి ఉందిగా!'.. ఆ నర్స్​ తెగువకు సలాం'

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. చేయి నరికేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.