బంగాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. పేదల కోసం ఉచిత మార్కెట్‌ను నిర్వహిస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ. అలిపుర్ద్వారాలోని భాతిబరిలో గురువారం ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు ఉచితంగా బియ్యం, పప్పుధాన్యాలు, నూనె, ఉప్పు, కూరగాయలను అందిస్తున్నారు.
ఇప్పటివరకు 80 కుటుంబాలను నిత్యావసరాలతో ఆదుకుంది ఈ సంస్థ. కాగా, ఏడాది కాలంగా సామాజిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యుడు సుదీప్ సాహా తెలిపారు.
ఇదీ చూడండి: ఆ కుటుంబం కోసం.. 24 గంటలపాటు సైనికుల ట్రెక్కింగ్