ETV Bharat / bharat

'అధికార మార్పిడి కాదు.. అభివృద్ధే లక్ష్యం'

బంగాల్​లో ఎన్నికలు కేవలం ప్రభుత్వంలో మార్పు కోసం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చాలా ఏళ్లుగా ప్రజలు శాంతి, భద్రత, అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో వర్చువల్​గా ప్రచారం నిర్వహించారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 23, 2021, 5:59 PM IST

బంగాల్​లో జరుగుతున్న ఎన్నికలు అధికారంలో మార్పు కోసం కాదని, అభివృద్ధి కోసమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వివక్ష లేని, సామరస్యంతో కూడిన ప్రభుత్వం కోసం బంగాల్​ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

కొవిడ్​ ఉద్ధృతి నేపథ్యంలో బంగాల్​లో పర్యటనలు రద్దు చేసుకున్న ప్రధాని మోదీ.. వర్చువల్​గా సూరి, మాల్దా, బెర్హంపోర్​, భవానిపుర్​లో ప్రచారం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉదయం నుంచి పలు సమావేశాలు నిర్వహించామని, ఈ క్రమంలో సాంకేతికత ఆధారంగా బంగాల్​ ప్రజలను కలుస్తున్నట్లు చెప్పారు.

" ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వంలో మార్పు కోసం కాదు. ఈ ఎన్నికల్లో ఆశావాహ బంగాల్​ను చూశాను. బంగాల్​ ప్రజలు చాలా ఏళ్లుగా శాంతి, భద్రత, అభివృద్ధి, గౌరవప్రదమైన వృత్తి, సురక్షిత జీవనం, సులభతర వాణిజ్యాన్ని కావాలనుకుంటున్నారు. అక్రమ వలసలు, సిండికేట్లు, దోపిడీ వంటివి బంగాల్​ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రతి ప్రభుత్వ విభాగం నిజాయితీగా విధులు నిర్వర్తించగలిగేలా ఉండే పాలన కోసం బంగాల్​ ఎదురుచూస్తోందన్నారు మోదీ. మహిళలకు వేగంగా న్యాయం అందించేందుకు ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మోదీ. సాంకేతికతతో కోల్​కతాను భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నగరంగా మార్చుతామన్నారు.

ఇదీ చూడండి: 'కరోనాను వదిలేసి.. సెంట్రల్​ విస్టాకు టెండర్లా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.