స్వాతంత్య్రానికి ముందు భారత ఆర్మీ ఏర్పాటు చేసేందుకు నేతాజీ సుభాస్ చంద్రబోస్ చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటులోనూ బోస్ పాత్ర కీలకమని గుర్తుచేశారు.
-
#WATCH | West Bengal CM Mamata Banerjee leads a march from Shyam Bazaar to Red Road in Kolkata, on the occasion of 125th birth anniversary of #NetajiSubhashChandraBose pic.twitter.com/s9VpoUqPSa
— ANI (@ANI) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | West Bengal CM Mamata Banerjee leads a march from Shyam Bazaar to Red Road in Kolkata, on the occasion of 125th birth anniversary of #NetajiSubhashChandraBose pic.twitter.com/s9VpoUqPSa
— ANI (@ANI) January 23, 2021#WATCH | West Bengal CM Mamata Banerjee leads a march from Shyam Bazaar to Red Road in Kolkata, on the occasion of 125th birth anniversary of #NetajiSubhashChandraBose pic.twitter.com/s9VpoUqPSa
— ANI (@ANI) January 23, 2021
స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా బంగాల్లో భారీ ర్యాలీ నిర్వహించిన మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలోని శ్యామ్ బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు వేలాది మంది వెంట రాగా 6 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.
ర్యాలీకి ముందు ట్విట్టర్‌లో నేతాజీకి నివాళి అర్పించిన మమత.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నేతాజీ 125వ జయంతి కార్యక్రమాన్ని 2022 జనవరి 23 వరకు నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు మమత తెలిపారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలను నేతాజీకి అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు.