బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'దీదీ ఇస్లామిక్ ఉగ్రవాది. ఆమె.. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో శరణార్థిగా జీవించాల్సి వస్తుంది. భారతీయతను, హిందూ దేవుళ్లు, దేవతలను కించపరిచేలా దీదీ వ్యవహరిస్తున్నారు.' అని పేర్కొన్నారు ఆనంద్ స్వరూప్. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: బంగాల్ ఎన్నికల బరిలో శివసేన