ETV Bharat / bharat

మోదీ X దీదీ: తారస్థాయికి సీఎస్​ వివాదం - మమతా బెనర్జీ

బంగాల్​ ప్రభుత్వ సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ సోమవారం దిల్లీలో రిపోర్ట్​ చేయటం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు దిల్లీ రావాలని డీఓపీటీ ఇచ్చిన నోటిఫికేషన్​ను పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు.. యాస్​ తుపానుపై సోమవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ భేటీకి సీఎస్​ హజరుకానున్నారు.

Alapan Bandyopadhyay
ఆలాపన్​ బంధోపాధ్యాయ్
author img

By

Published : May 30, 2021, 7:28 PM IST

బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం, దీదీ సర్కార్​ మధ్య వివాదం కొనసాగుతోంది. బంధోపాధ్యాయ్​ను రిలీవ్​ చేయాలని, ఆయన దిల్లీలో సోమవారం రిపోర్ట్​ చేయాలని ఆదేశించింది కేంద్రం. అయితే బంధోపాధ్యాయ్.. ​ దిల్లీలో సోమవారం రిపోర్ట్​ చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్త్​ బ్లాక్​లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఇచ్చిన నోటిఫికేషన్​ను పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి.

కేంద్రం ఆదేశించినప్పటికీ.. బంధోపాధ్యాయ్​ను బంగాల్​ ప్రభుత్వం ఇప్పటికీ రిలీవ్​ చేయలేదు. సోమవారమే సీఎస్​గా బంధోపాధ్యాయ్​ చివరి పనిదినం కావటం గమనార్హం. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్ర అనుమతించింది. అయితే.. అందుకు బంధోపాధ్యాయ్​ అంగీకరించాల్సి ఉంది.

సోమవారం అత్యవసర భేటీ..

దిల్లీలో బంగాల్​ సీఎస్​ రిపోర్ట్​ చేయాలని కేంద్రం ఆదేశించిన సమయంలోనే.. యాస్​ తుపానుపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నబాన్నలో జరిగే భేటీకి సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర డిప్యూటేషన్​కు బంధోపాధ్యాయ్​ను రిలీవ్​ చేసే అవకాశాలు లేవని పేర్కొన్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఏకపక్షంగా బదిలీ కుదరదు..!

బంగాల్​ సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ పదవీ విరమణ రోజునే కేంద్రం మరోమారు డిప్యుటేషన్​కు ఆదేశించే అవకాశం ఉందని మాజీ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్​ చేసేందుకు నిరాకరించే అవకాశం ఉన్నందున దానిని అమలు చేయటం కేంద్రానికి క్లిష్టంగా మారొచ్చని పేర్కొన్నారు. ఆలాంటి బదిలీలను తిరస్కరించే ఆల్​ ఇండియా సర్వీస్​ రూల్స్​ను సూచిస్తూ కేంద్రానికి రాష్ట్రం సమాధానం ఇచ్చే అవకాశం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జవహార్​ సిర్కార్​. ఏకపక్షంగా ఐఏఎస్​, ఐపీఎస్​ను బదిలీ చేయటం కేంద్రానికి అంత సులభం కాదన్నారు. ఈ విషయంలో బంగాల్​ ప్రభుత్వం లేదా బంధోపాధ్యాయ్​ అంగీకారం అవసరం ఉంటుదని కానీ, అలా చేయలేదని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: సీఎస్ కోసం మోదీ, దీదీ ప్రభుత్వాల పేచీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.