Weekly Horoscope: ఈ వారం (మార్చి27 - ఏప్రిల్02) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..
మేషం
ముఖ్య కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.లక్ష్యాన్నిదృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్నిసమయాలలో ఒక నిర్ణయానికి కట్టుబడక నిర్ణయాలు తరచూ మారుస్తుంటారు.ఎవరినీ అతిగా నమ్మకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. కలహాలు సూచితం. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
వృషభం
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటి వారి నుంచి సహకారం అందుతుంది. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించండి. మళ్లీ ఇలాంటి శుభకాలం ఎన్నాళ్ల కోకానీ రాదు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్ధిక లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది.
మిథునం:
శుభకాలం నడుస్తోంది. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఎంతటి కార్యాన్నైనా ఇట్టే పూర్తిచేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవతా స్మరణ ఉత్తమం.
కర్కాటకం:
ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి ఆటంకాన్నైనా ఎదుర్కొంటారు. మీ మీ రంగాల్లో జాగ్రత్తలు అవసరం. బంధు,మిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. మనోవిచారం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది.
సింహం:
మంచి కాలం. ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్ధికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను సద్భావంతో పూర్తిచేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. దృఢ సంకల్పాలు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. అధికారుల సహకారం అందుతుంది. శివారాధన శుభప్రదం.
కన్య:
ఆర్థికాంశాలు అనుకూలంగా ఉంటాయి. ఓర్పుగా పనులను పూర్తిచేసే దిశగా ముందుకు సాగండి. ఆశించిన ఫలితాల కోసం బాగా శ్రమించాలి. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొహమాటంవల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివితే మంచి ఫలితాలు పొందుతారు.
తుల:
అనుకున్నది సిద్ధిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో మంచి భవిష్యత్తును అందుకుంటారు. స్వీయ ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. ఆర్ధికంగా మంచి ఫలితాలు వస్తాయి. భోజన సౌఖ్యం కలదు. మిమ్మల్ని చూసి ఓర్వలేనివారు ఉన్నారు. బంధువుల వల్ల మంచి జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.
వృశ్చికం:
అదృష్టం వరిస్తుంది. స్ఫష్టమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. గొప్ప ఆర్ధిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. చిన్నచిన్న పొరపాట్లు దొర్లినా అంతిమ విజయం మీదే అవుతుంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
ధనుస్సు:
సంకల్పాలు నెరవేరుతాయి. శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి. బుద్దిబలంతో అనుకున్నది సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. చేపట్టిన పనుల్లో శుభఫలితాలు సిద్దిస్తాయి. పరిస్థితులు అన్నివిధాలా అనుకూలిస్తాయి. బంధు,మిత్రుల సహకారం అందుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. నూతన వస్తు,వాహనయోగాలు ఉన్నాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
మకరం:
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఒక వ్యవహారంలో మీకు ధనలాభం, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితాన్నిఅందుకుంటారు. స్థిర చిత్తంతో తీసుకునే నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. వ్యతిరేక ఆలోచనలను దరిచేరనీయకండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల కారణంగా ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు లేదా వ్యక్తుల వల్ల బాధ కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకుంటే కాస్త్ర మంచిది. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. విష్ణు ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది.
కుంభం:
తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. లక్ష్యం నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. అధికారులతో, పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికస్థితి మెరుగుపడుతుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
మీనం:
శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి. మీ మీ రంగాల్లో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తోంది. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తోటి వారి సహకారం అందుతుంది. ఆటంకాలు తొలుగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆర్ధికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.