Weekly Horoscope: ఈ వారం (జనవరి 16 - జనవరి 22) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..
మేషం:
స్థిరమైన మనస్సుతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. దైవబలం పరిపూర్ణంగాఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఒక తీపివార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. సర్వత్రా విజయం ఉంది. ఇష్టదేవతా ధ్యానం మేలైన ఫలితాలను ఇస్తుంది.
వృషభం:
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు. అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య ధ్యాన శ్లోకం చదివితే శుభఫలితాలు ఉంటాయి.
మిథునం:
మంచి ఫలితాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నూతన పద్దతులను అవలంభిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ల ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఇష్ట దేవతా ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
కర్కాటకం:
ఎవరినీ అతిగా నమ్మకండి. వృత్తి,ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగంలో స్థానచలనం సూచితం. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. ఆర్థిక విషయంలో కొంత శ్రద్ద అవసరం. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ ధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
సింహం:
ప్రయత్నకార్యసిద్ది ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్త్ర, వస్తు ప్రాప్తి కలదు. వివాదాల్లో తలదూర్చకండి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మృదువుగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవాలి.
కన్య:
ప్రయత్నించిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన ఉత్తమం.
తుల:
చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల సహకారం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. మీలోని పరోపకారబుద్ది, సత్యనిష్ఠ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నిష్పక్షపాత నిర్ణయాలతో మనశ్శాంతి దక్కుతుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మరువకండి. శనిధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
వృశ్చికం:
మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేయండి. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.
ధనుస్సు:
మీ మీ రంగాల్లో సమర్థవంతంగా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు అందుతాయి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. భోజన సౌఖ్యం ఉంది. ఆధ్యాత్మిక సంపదను పెంచండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
మకరం:
ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఉంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. ఆస్తి విలువను పెంచేలా మీ ఆలోచనావిధానం ఉంటుంది. మీ ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. నైతికంగా బలపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. శివాలయ సందర్శనం శుభప్రదం.
కుంభం:
మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనిలో చిత్తశుద్ది చాలా అవసరం. మీ మీ రంగాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక విషయాలలో శ్రద్ధగా వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. బంధుమిత్రుల సలహాలు సూచనలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. తప్పుదోవ పట్టించేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
మీనం:
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల పట్ల మనస్సు ఉంటే క్రమశిక్షణ దెబ్బ తింటుందని దృష్టిలో ఉంచుకోండి. మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విష్ణు నామస్మరణ మంచిది.