wedding of pet dogs: బంగారు అభరణాలతో అలకరించిన వధూవరులు.. 500 మందితో భారీ ఊరేగింపు.. పెళ్లి అనంతరం అనేక రకాల వంటకాలతో భోజనాలతో వివాహం ఘనంగా జరిగింది. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ కథంతా మనుషుల పెళ్లి గురించి కాదండి.. పెంపుడు కుక్కల వివాహం గురించి! ఈ వింత వివాహం ఎక్కడ జరిగిందో తెలుసుకోండి!
ఉత్తర్‌ప్రదేశ్ హమీర్పుర్ జిల్లాలోని సుమెర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత వివాహం జరిగింది. భరువా గ్రామానికి చెందిన ఇద్దరు సాధువులు తమ పెంపుడు కుక్కలకు హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశారు. సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయం ఉంది. ఈ గుడిలో ప్రధాన పూజారి స్వామి ద్వారకా దాస్ మహారాజ్‌కు ఓ పెంపుడు కుక్క ఉంది. ఈ కుక్కకు వివాహం చేయాలని అనుకున్న స్వామి ద్వారకా దాస్.. పరఛాచ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంచుకునే ఆడ కుక్కతో నిశ్చయించాడు.
జూన్ 5న మూహుర్తం పెట్టి తన శిష్యులను, భక్తులను ఆహ్వానించారు. 500 మందితో భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు. మనసర్ శివాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు వీధుల్లో తిరుగుతూ పరఛాచ్ గ్రామానికి చేరుకుంది. అనంతరం వివాహ సంప్రదాయాల ప్రకారం కుక్కలను కొత్త బట్టలతో, బంగారు అభరణాలతో అలంకరించారు. తర్వాత శిష్యులు, భక్తుల సమక్షంలో ఘనంగా వివాహ కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లి అనంతరం అతిథులకు అనేక రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు.
ఇదీ చదవండి: ఆ ఇద్దరికీ తెలియకుండా ఆమెకు మూడో పెళ్లి.. న్యాయం కోసం భర్తల పోరాటం!