ETV Bharat / bharat

gold robbery in rajasthan: ఫైవ్​ స్టార్​ హోటల్లో పెళ్లి- రూ.2కోట్ల నగల చోరీ - జైపూర్​లో భారీ చోరీ

ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ చోరీ జరిగింది. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. జైపుర్‌లో గురువారం ఈ దొంగతనం (robbery in jaipur) జరిగింది.

Thief
చోరీ
author img

By

Published : Nov 27, 2021, 2:56 PM IST

రాజస్థాన్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. జైపుర్‌లో గురువారం ఈ దొంగతనం (robbery in jaipur) జరిగింది.

ముంబయికి చెందిన వ్యాపారి రాహుల్‌ భాటియా కుమార్తె వివాహాన్ని ఈ హోటల్‌లో నిర్వహిస్తుండగా.. ఆ కుటుంబం ఏడో అంతస్తులోని ఓ గదిలో బస చేసింది. వారంతా హోటల్‌ ప్రాంగణంలో పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. హోటల్‌ సిబ్బంది సహకారంతోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Param Bir Singh News: పరంబీర్​ సింగ్​కు సీఐడీ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.