ETV Bharat / bharat

కొవిషీల్డ్.. నెలకు 10కోట్ల డోసులు - సీరమ్​ ఇన్​స్టిట్యూట్

ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ను, 2021 జనవరి నుంచి ప్రతినెలా 10 కోట్ల డోసుల చొప్పున ఉత్పత్తి చేయాలని సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ నిర్ణయించింది. అలాగే.. ​2022 కల్లా తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 150 కోట్ల డోసుల నుంచి 250 కోట్ల డోసులకు పెంచుకుంటామని ఎస్‌ఐఐ సీఈఓ ఆదార్‌ పూనావాలా చెప్పారు.

covishiled
కొవిషీల్డ్​ వ్యాక్సిన్​
author img

By

Published : Dec 12, 2020, 6:26 AM IST

Updated : Dec 12, 2020, 6:48 AM IST

కొవిడ్‌ నిరోధానికి ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను, 2021 జనవరి నుంచి ప్రతినెలా 10 కోట్ల డోసుల చొప్పున ఉత్పత్తి చేయాలని పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) నిర్ణయించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ పరీక్షలు దేశీయంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను 5 కోట్ల డోసుల మేర ఉత్పత్తి చేసిన సంస్థ, అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి కోరిన సంగతి విదితమే. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐఐను డ్రగ్‌ కంట్రోలర్‌ అడిగినట్లు తెలిసింది. 23,000 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా, సగటున 70 శాతానికి పైగా సామర్థ్యాన్ని చూపిందని ఆస్ట్రాజెనెకా వెల్లడించిన సంగతి విదితమే. భవిష్యత్తులో ప్రబలే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని, 2022 కల్లా తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 150 కోట్ల డోసుల నుంచి 250 కోట్ల డోసులకు పెంచుకుంటామని ఎస్‌ఐఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆదార్‌ పూనావాలా చెప్పారు. తాము అనేక రకాల వ్యాక్సిన్లు తయారు చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. తాము తయారు చేస్తున్న కొవిషీల్డ్‌ను తొలుత భారత్‌లోనే పంపిణీ చేస్తామని తెలిపారు. తదుపరి ఆఫ్రికా సహా ఇతర వర్థమాన దేశాలకు సరఫరా చేస్తామని వివరించారు. .

క్లినికల్‌ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా, ఆర్‌డీఐఎఫ్‌ భాగస్వామ్యం

కొవిడ్‌ నిరోధానికి తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌లో ఒక కాంపొనెంట్‌ను, తమ క్లినికల్‌ పరీక్షల్లో ప్రయోగించడానికి ఆస్ట్రాజెనెకా అంగీకరించిందని రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) శుక్రవారం ప్రకటించింది. ఆర్‌డీఐఎఫ్‌, గమాలెయా సంస్థలు నవంబరు 23న ప్రతిపాదించిన మేర 2 హ్యూమన్‌ అడెనోవైరస్‌ వెక్టార్స్‌లో ఒక కాంపొనెంట్‌ను క్లినికల్‌ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా వినియోగించనుంది. ఈ నెలాఖరు కల్లా స్పుత్నిక్‌ వి హ్యూమన్‌ అడెనోవైరల్‌ వెక్టార్‌ టైప్‌ ఏడీ 26తో కలిసి ఆస్ట్రాజెనెకా తాము అభివృద్ధి చేసిన ఏజడ్‌డీ 1222ను క్లినికల్‌ పరీక్షల్లో వాడనుంది. ఈ రెండింటి కలయికతో మరింత మెరుగైన వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయొచ్చా అనిశాస్త్రవేత్తలు పరిశోధన చేయనున్నారు.

వర్థమాన దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ల సమీకరణ, ప్రజలకు అందించడం కోసం అభివృద్ధి చెందుతున్న సభ్య దేశాలకు 900 కోట్ల డాలర్ల (సుమారు రూ.67,000 కోట్లు) సాయాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) ప్రకటించింది. ఆసియా-పసిఫిక్‌ వ్యాక్సిన్‌ యాక్సెస్‌ ఫెసిలిటీ (ఏపీవీఏఎక్స్‌) పేరిట ఈ కార్యక్రమాన్ని ఏడీబీ ప్రారంభించింది. ఏడీబీకి చెందిన సభ్యదేశాలు త్వరలో తమ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడానికి సిద్ధమవుతున్నాయని, వ్యాక్సిన్‌ల సమీకరణ, నిర్వహణ ప్రక్రియకు ఆయా దేశాలకు భారీమొత్తం నిధులు అవసరమని ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకవా పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సభ్య దేశాలు కొవిడ్‌-19 సంక్షోభం నుంచి బయటపడటానికి, ఆర్థిక రికవరీపై దృష్టిపెట్టడానికి ఏపీవీఏఎక్స్‌ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఇప్పటివరకు 1.43 కోట్లకు పైగా కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని, 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని ఏడీబీ వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆసియా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 0.4 శాతం క్షీణించే అవకాశం ఉందని అంచనా వేసింది. 1960ల తర్వాత ఈ ప్రాంతంలో జీడీపీ క్షీణత నమోదుకావడం ఇదే ప్రథమం.

ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ పరీక్షలకు అనుమతి

దేశీయంగా తొలిసారి అభివృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను మనుషులపై మొదటి, రెండోదశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లభించినట్లు బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం వెల్లడించింది. పుణెకు చెందిన జెన్నోవా కంపెనీ 'ఎంఎన్‌ఆర్‌ఏ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ హెచ్‌జీసీఓ 19'ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ పద్ధతితో వ్యాధి నిరోధకతను ఎంఎన్‌ఆర్‌ఏ అభివృద్ధి చేయదు. ఇందుకు బదులుగా వైరస్‌కు చెందిన సింథటిక్‌ ఆర్‌ఎన్‌ఏ ద్వారా శరీరంలో ప్రోటీన్‌ అభివృద్ధి చేసి, వ్యాధి ప్రబలకుండా అడ్డుకుంటుంది.

ఇదీ చూడండి: కొవిషీల్డ్​, స్పుత్నిక్​-వీ టీకాలు కలిపి ప్రయోగం

Last Updated : Dec 12, 2020, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.