ETV Bharat / bharat

కాంగ్రెస్​ పార్టీకి నేనే ఫుల్​టైమ్​ అధ్యక్షురాలిని: సోనియా

కాంగ్రెస్​ పార్టీకి ప్రస్తుతం తాను పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని.. నూతన ప్రెసిడెంట్​ ఎన్నిక కరోనా వల్లే ఆలస్యమైందని సోనియా గాంధీ(congress news today) అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో(cwc meeting news) మాట్లాడిన ఆమె.. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని. అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.

sonia
సోనియా
author img

By

Published : Oct 16, 2021, 12:03 PM IST

Updated : Oct 16, 2021, 12:53 PM IST

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై(congress new president) నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు(congress news today). పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ)(cwc meeting news) సమావేశమైంది. ఈ సందర్భంగా సోనియా ప్రారంభ ఉపన్యాసం చేశారు.

జూన్​ 30 నాటికే కొత్త అధ్యక్షుడిని(congress news) ఎన్నుకునేందుకు రోడ్ మ్యాప్​ ఖరారు చేసినప్పటికీ కరోనా రెండో దశ వల్ల వాయిదా పడిందని సోనియా గాంధీ అన్నారు. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని, అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.

పార్టీ నేతలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబితే తాను అభినందిస్తానని.. కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు(congress news today). ఈ రోజు అన్ని విషయాలపై స్పష్టత తీసుకురాల్సిన సందర్భమొచ్చిందని చెప్పారు. నిజాయతీగా, స్వేచ్ఛగా అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు.

నేతలంతా కేవలం పార్టీ ప్రయోజనాల మీద మాత్రమే దృష్టి సారించి ఐకమత్యంగా కృషి చేస్తే రాబోయే అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని సోనియా అన్నారు(sonia gandhi cwc meet ). ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సోనియా ఘాటు విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్ధ ఆందోళనకరంగా తయారైందని.. దీనికి సమాధానంగా కేంద్రం కేవలం ఆస్తులను విక్రయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అంటే కేవలం వ్యూహాత్మకమైనవి మాత్రమే కాదని, దానికి సామాజిక లక్ష్యాలు కూడా ఉంటాయని అన్నారు. నూతన సాగు చట్టాలు, లఖింపుర్‌ ఘటన, చైనా చొరబాట్లు, జమ్ముకశ్మీర్‌లో మైనార్టీల హత్యల అంశంలో కూడా కేంద్రంపై సోనియా విమర్శలు గుప్పించారు.

దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్​, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్​, పంజాబ్​ సీఎం చరణ్​జీత్​ సింగ్ చన్నీ హాజరయ్యారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సహా ఇతర జీ-23 నేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండి: జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళులు

Last Updated : Oct 16, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.