ETV Bharat / bharat

'భాజపా రౌడీల పార్టీ.. నేను మీ కాపలాదారును' - భాజపా రౌడీల పార్టీ

భాజపా కార్యకర్తలు గూండాలని ఆరోపించారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోమన్నా.. కాషాయ పార్టీకి ఎలాంటి అవకాశమివ్వకూడదనే ప్రచారంలో పాల్గొంటున్నట్లు చెప్పారు.

WB polls: Mamata says BJP people are 'goons', calls herself 'paharadar'
'భాజపా రౌడీల పార్టీ.. నేను మీ కాపలాదారును'
author img

By

Published : Apr 3, 2021, 7:10 AM IST

భాజపా కార్యకర్తలను గూండాలుగా అభివర్ణించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాలికి గాయంతో బాధపడుతున్న తనను వైద్యలు విశ్రాంతి తీకుకోమన్నా.. భాజపాకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. అలిపుర్​ద్వార్​లో శుక్రవారం జరిగిన ఓ ర్యాలీలో మమత పాల్గొన్నారు.

"నందిగ్రామ్​లో గురువారం పోలింగ్​ బూత్​కు ఎందుకు వెళ్లానో తెలుసా? బయటనుంచి వచ్చిన గూండాలు తుపాకులతో అక్కడ మోహరించారు. పరాయి భాషలో మాట్లాడుతున్నారు. భాజపా కార్యకర్తలు రౌడీలు. ఆ పార్టీ మనకు వద్దు. గుర్తు పెట్టుకోండి. నేను మీ కాపలాదారును. వైద్యులు నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ, రాజకీయ సంగ్రామంలో ఒంటరిగా పోరాడే అవకాశం భాజపాకు ఇవ్వదలచుకోలేదు."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

భయపెడుతున్నారు..

ప్రజలను కేంద్ర హోంమంత్రి భయపెడుతున్నారని మమత ఆరోపించారు. ఆ పార్టీ పెద్దఎత్తున డబ్బులు పంచిపెడుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రౌడీల కోసం వెయ్యికి పైగా హోటళ్లను భాజపా అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు.

తప్పుడు హామీలు..

తేయాకు కార్మికుల కూలీని తమ ప్రభుత్వం రూ.202కు పెంచినట్లు మమత గుర్తు చేశారు. ప్రత్యేక టీ బోర్డు ఏర్పాటు చేస్తామని భాజపా తప్పుడు హామీలు ఇస్తోందని విమర్శించారు. శరణార్థుల కోసం ఎంతో చేసినట్లు చెప్పారు. ప్రజలు అడిగినవన్నీ తాను చేస్తానని, అయితే దానికి ముందు తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'అవినీతి, రాజకీయ హింసలో ఆ రెండూ ఒకటే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.