ETV Bharat / bharat

ఆ అనుమానంతో కుటుంబాన్ని చితకబాది.. మూత్రం​ తాగించిన గ్రామస్థులు! - sodomising news

Family beaten up forced to drink urine: మంత్రాలు చేస్తున్నారనే ఆరోపణలతో ఓ కుటుంబాన్ని దారుణంగా చితకబాది.. వారిచేత మూత్రాన్ని తాగించారు ఓ గ్రామస్థులు. ఈ దారుణం బంగాల్​లో జరిగింది. మరో ఘటనలో కూతురితో వాగ్వాదం మధ్యలో ఆమెను కర్రలతో బాది.. ఆమె చావుకు కారణమయ్యాడు ఓ తండ్రి.

Family beaten up forced to drink urine:
Family beaten up forced to drink urine:
author img

By

Published : May 27, 2022, 7:40 AM IST

Family beaten up forced to drink urine: బంగాల్ ముర్షీదాబాద్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. రఘునాథ్​గంజ్​ ప్రాంతంలోని మథురాపుర్​లో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబాన్ని చితకబాదారు స్థానికులు. అనంతరం వారి చేత మూత్రం తాగించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారడం వల్ల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అంతకుముందు.. గురువారం ఉదయం కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. దక్షిణ్ దినాజ్​పుర్​ జిల్లాకు చెందిన లక్ష్మీరామ్​ హెమ్​బ్రమ్​ అనే వ్యక్తిని చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పలువురు దుండగులు హత్య చేశారు. అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం బతకలేకపోవచ్చని పక్కింట్లో ఉండే ఫాగు బస్కే అనే వ్యక్తికి జోస్యం చెప్పడమే కారణం. హెమ్​బ్రమ్​ జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫాగు బస్కే కుమారుడు.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో కుటుంబాన్ని చితకబాది, మూత్రం తాగించిన గ్రామస్థులు

అసంతృప్తితో భర్తను హతమార్చిన భార్య: ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన సెంట్రల్​ దిల్లీలోని దర్యాగంజ్​లో జరిగింది. నిందితులను జీబా ఖురేషీ (40), షోయబ్ (29), వినీత్ గోస్వామి (29)గా గుర్తించారు పోలీసులు. భర్త మొయినుద్దీన్​ ఖురేషీని మే17న రాత్రి 10 గంటలకు ఆరుబయట మూత్రం చేస్తున్న సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

"భర్తతో సంతోషంగా లేని కారణంగా అతడిని వదిలించుకొని వేరొకని వివాహం చేసుకోవాలని జీబా భావించేది. ఈ క్రమంలోనే రెండేళ్ల కింద ఫేస్​బుక్​లో షోయబ్​తో పరిచమైంది. తనను పెళ్లి చేసుకోమని, అడ్డుగా ఉన్న భర్తను చంపాలని అతడిని ఒప్పించింది. 5నెలల పాటు ప్లాన్​ చేసి హత్య కోసం గోస్వామితో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు" అని పోలీసులకు వివరించారు.

చిన్నారిపై మైనర్​ లైంగిక దాడి: నాలుగేళ్ల చిన్నారి(బాలుడు)పై లైంగిక దాడికి పాల్పడిన 14 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు యూపీ పోలీసులు. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్​ ఇస్తానని ఆశచూపించి.. లోపలికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు మైనర్​. చిన్నారి అరుపులు విని.. భవనంలోనికి వెళ్లి చూడగా.. అతడికి రక్తస్రావం కావడాన్ని గమనించారు తల్లిదండ్రులు. దీంతో డాక్టర్​ దగ్గరకు తీసుకెళ్లగా, విషయం బయటపడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వారు పోక్సో చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కర్రలతో బాది కూతురి హత్య: 19 ఏళ్ల కూతురిని చితకబాది ఆమె చావుకు కారణమయ్యాడు ఓ తండ్రి. ఈ ఘటన బంగాల్​లోని జల్​పాయ్​గుడిలో జరిగింది. కూతురితో వాగ్వాదం మధ్యలో క్షణికావేశంలో ఆమెను కర్రలతో కొట్టాడు నిందితుడు. స్థానికులు ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అనంతరం అతడు సమీపంలోని అడవిలోకి పారిపోగా.. స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: నదిలో దూకి బాలిక ఆత్మహత్యాయత్నం.. రాళ్ల మధ్యలో చిక్కుకొని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.