దీదీ చాలా కాలంగా తెలుసు..
బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడి, బంగాల్ ప్రజలను దోచుకున్నారని, అంపన్ తుపానుకు ఇచ్చిన రిలీఫ్ ప్యాకేజీని కూడా లూటీ చేశారని ఆరోపించారు.
"దీదీ నాకు చాలా కాలంగా తెలుసు. వామపక్షాలకు వ్యతిరేకంగా గళం విప్పిన వ్యక్తి ఆమెలో ఇప్పుడు లేరు. ఇప్పుడామె వేరొకరి భాష మాట్లాడుతున్నారు, వారే ఆమెను నియంత్రిస్తున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధాని