మన్సుఖ్ హిరెన్ మృతి కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే పాత్ర ఉందని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అధికారి జైజీత్ సింగ్ తెలిపారు. వాజే.. ఏటీఎస్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తమకు ఆయన కస్టడీ అవసరమని తెలిపారు. ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన వాజే.. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. మార్చి 25 వరకు ఆయన కస్టడీలో కొనసాగనున్నారు.
దమన్ దీవ్లో కారు
హిరెన్ కేసుకు సంబంధించి దమన్ దీవ్లో ఓ కారును స్వాధీనం చేసుకుని ఠాణెలోని ఏటీఎస్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కారును పరిశీలిస్తోందన్నారు. ఈ వోల్వో కారుకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందన్నారు. కారు యజమాని ఎవరో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి : 'హిరేన్ మృతి కేసు కథ ముగిసింది!'