ETV Bharat / bharat

'ఆ నీరు వాడడం వల్లే బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి!'

కొవిడ్​-19 మహమ్మారి నుంచి కోలుకున్నామని ఆనందపడేలోగా కొందరిని బ్లాక్​ ఫంగస్​ కలవర పెడుతోంది. గుజరాత్​, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ మ్యూకోర్​మైకోసిస్​ అనే శిలీంధ్ర వ్యాధి పంజా విసురుతోంది. కొవిడ్​ రోగుల్లో ఈ వ్యాధి విజృంభించేందుకు కారణమేంటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Humidifier
ఆక్సిజన్​ హ్యుమిడిఫయర్
author img

By

Published : May 14, 2021, 3:45 PM IST

కొవిడ్​-19 మహమ్మారి నుంచి కోలుకున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది మ్యూకోర్​మైకోసిస్​(బ్లాక్​ ఫంగస్​). కిడ్నీ సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్​ బాధితులపైనా ఈ శిలీంధ్ర వ్యాధి పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా బ్లాక్​ ఫంగస్​ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్​లో మొత్తం 500 కేసులు రాగా అహ్మదాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే 46 బ్లాక్​ ఫంగస్​ కేసులు బయటపడ్డాయి. గతంలో కిడ్నీ, క్యాన్సర్​ బాధితులపైనే బ్లాక్​ ఫంగస్​ ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం డయాబెటిస్​ రోగులు సైతం ఈ శిలీంధ్ర వ్యాధితో బాధపడుతున్నారు. అయితే.. ఈ వ్యాధికి సరైన చికిత్స తీసుకుని బయటపడొచ్చని, ఆందోళనకు గురికావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Humidifier
బ్లాక్​ ఫంగస్​ బారిన పడిన రోగులు

అసలు ఈ వ్యాధికి కారణాలేంటి? నిపుణుల మాటేంటి?

ఆక్సిజన్​ అందించేప్పుడు స్టెరైల్​(శుభ్రమైన) నీటికి బదులుగా సాధారణ నీటని హ్యుమిడిఫయర్​ (తేమ అందించే పరికరం)లో ఉపయోగించటం కూడా మ్యూకోర్​మైకోసిస్​కు ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఈ అంశంపై ఈటీవీ భారత్​కు కీలక విషయాలు వివరించారు అహ్మదాబాద్​కు చెందిన సీనియర్ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్​ అతుల్​ అభ్యంకర్.

Humidifier
ఆక్సిజన్​ హ్యుమిడిఫయర్​లోని నీరు

" ఈ వ్యాధి వ్యాప్తికి కారణాల్లో ప్రధానమైనవి ఆక్సిజన్​కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే. వాటిల్లో స్టెరైల్​(శుభ్రమైన) నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రాలు, ఇళ్లల్లో కరోనా రోగులకు ఆక్సిజన్​ ఇచ్చేటప్పుడు హ్యుమిడిఫయర్​లో నల్లా నీటిని వాడుతున్నారు. అందులో చాలా రకాల సుక్ష్మ జీవులు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్​ ఏర్పడుతుంది. హ్యుమిడిఫయర్​లో తప్పకుండా స్టెరైల్​ నీటినే వినియోగించాలి. 24 గంటల్లో రెండు సార్లు నీటని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్​ను శుభ్రం చేయాలి. "

- డాక్టర్​ అతుల్​ అభ్యంకర్​, సీనియర్​ హృద్రోగ చికిత్స నిపుణులు

స్టెరాయిడ్ల దుష్ప్రభావాలతోనూ..

మ్యూకోర్​మైకోసిస్​ అనేది చాలా అరుదైన వ్యాధి. కానీ, తీవ్రమైనది, ఇది ప్రతిచోటా జీవులలో కనిపిస్తుంది. బురద నేలల్లో ఎక్కువగా వృద్ధి చెందుతుంది. మ్యూకోర్​మైకోసిస్​ ఫంగస్​.. శ్వాస, గాయాల నుంచి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొవిడ్​-19 చికిత్సలో రెమ్​డెసివిర్​, టొసిలిజుమాబ్​ ఇంజక్షన్లు కొరత కారణంగా రోగులకు ఎక్కువగా స్టెరాయిడ్స్​ ఇస్తున్నారు. వాటి దుష్ప్రభావాల కారణంగా మ్యూకోర్​మైకోసిస్​ దాడి చేస్తోంది. కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతోంది.

Humidifier
ఆక్సిజన్​ హ్యుమిడిఫయర్​

అలా చేయటం ప్రమాదకరం!

మరోవైపు.. గుజరాత్​లో కరోనా బారిన పడిన వారు ఆవు పేడ, ఆవు మూత్రాన్ని శరీరంపై రాస్తున్నారు. దాని ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి కొవిడ్​-19 నుంచి కోలుకునేందుకు సాయపడుతుందని భావిస్తున్నారు. దీనిపై దేశీయంగా పరిశోధన చేపట్టిన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆవు పేడను శరీరంపై పూసుకోవటం ద్వారా కొవిడ్​కు రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. దాని ద్వారా మ్యుకోర్​మైకోసిస్​ వంటి ఫంగస్​ ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ​

ఇదీ చూడండి: 'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.