కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుతం రెండు వారాల కర్ఫ్యూ అమల్లో ఉంది. పౌరులందరూ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దక్షిణ కన్నడలోని పుత్తూరుకు చెందిన ప్రవీణ్ డిసౌజా అనే వ్యక్తి ఒక అడుగు ముందుకేసి తన పెంపుడు శునకానికి సైతం మాస్కును ధరింపజేశాడు. పోలీసులు, అధికారుల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాడు.
పుత్తూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. ప్రవీణ్ స్కూటీపై మాస్కు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్న పెంపుడు జంతువును చూసి ఆశ్చర్యపోయారు. నగరంలో డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహించే ప్రవీణ్.. మాస్కు ధరించడమే గాక, తన పెంపుడు జంతువుకు సైతం మాస్కు పెట్టి సురక్షిత సందేశాన్నిస్తున్నాడని కొనియాడారు.
ఇతరులకూ ఇదేవిధంగా అవగాహన కల్పించాలని ప్రవీణ్‌కు సూచించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి: కరోనా బాధితులకు అండగా 'ఆదర్శ కుటుంబం'