కరోనా కట్టడికి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అనుసరిస్తున్న విధానం సుప్రీంకోర్టుతో సహా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ రోగులకు ఆక్సిజన్ కొరత రాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను దిల్లీ ఆదర్శంగా తీసుకోవాలని రెండు రోజుల క్రితం విచారణ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ దిల్లీ ప్రభుత్వానికి సూచించారు.
బృహన్ ముంబయి మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహాల్ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆక్సిజన్ సరఫరా, నిల్వలు, ఉత్పత్తి, సిలిండర్ల లభ్యత లాంటి విషయాల పర్యవేక్షణ కోసం కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఇబ్బందుల్లేకుండా చూడటం వల్ల ఇప్పుడు అక్కడ మరణాల సంఖ్య దేశంలోని మిగతా ప్రధాన నగరాల కంటే గణనీయంగా తగ్గింది. దిల్లీ, పుణె, బెంగళూరు అర్బన్, చెన్నై, కోల్‌కతాలతో పోలిస్తే ముంబయిలో కేసుల తగ్గుదల ఆశాజనకంగా ఉంది.
ఇదీ చూడండి: 'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ