ETV Bharat / bharat

మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం.. ఎంత మంది ఓటేశారంటే?

author img

By

Published : Feb 14, 2022, 7:13 AM IST

Updated : Feb 14, 2022, 6:06 PM IST

assembly polls
అసెంబ్లీ ఎన్నికలు

18:04 February 14

గోవా, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు గోవాలో రికార్డు స్థాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలసంఘం అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్​లో 59.37 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక ఉత్తర్​ప్రదేశ్ రెండో దశలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం ఐదు గంటల వరకు 60.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ పూర్తయింది.

13:40 February 14

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో.. ఉత్తర్‌ప్రదేశ్‌ రెండో దశ పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. 55 అసెంబ్లీ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 39.07 శాతం ఓటింగ్​ నమోదైంది.
  • ఉత్తరాఖండ్​లో.. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. ఒంటి గంట వరకు 35.21 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
  • గోవాలో.. ఒంటి గంట వరకు 44.63 శాతం పోలింగ్‌ నమోదైంది.

11:44 February 14

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో.. ఉత్తర్‌ప్రదేశ్‌ రెండో దశ పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. 55 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 11 గంటల వరకు 23.03 శాతం ఓటింగ్​ నమోదైంది.
  • ఉత్తరాఖండ్​లో.. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 18.97 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
  • గోవాలో.. 11 గంటల వరకు 26.63 శాతం పోలింగ్‌ నమోదైంది.

10:06 February 14

ఉత్తర్‌ప్రదేశ్‌లో 9.45 శాతం పోలింగ్​..

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్​ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.45 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో 5.15 శాతమే..

ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 5.15 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది.

గోవాలో అత్యధికం..

గోవాలో 40 స్థానాలకు పోలింగ్​ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.04 శాతం పోలింగ్‌ నమోదైంది.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​.. కోతంబిలోని పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

09:09 February 14

తరలివస్తున్న ఓటర్లు..

గోవా, ఉత్తరాఖండ్​ సహా ఉత్తర్​ప్రదేశ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చలినిసైతం లెక్కచేయకుండా ఓటు వేసేందుకు పోలింగ్​ బూత్​లకు తరలివస్తున్నారు ఓటర్లు.

ఓటు వేసిన ఉత్తరాఖండ్​ సీఎం

ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖటిమా భాజపా అభ్యర్థి పుష్కర్​ సింగ్​ ధామీ. ఖటిమాలోని పోలింగ్​ బూత్​లో తన భార్య, తల్లితో కలిసి ఓటు వేశారు.

కేంద్ర మంత్రి నఖ్వీ..

ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో కేంద్రమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​ స్టేషన్​కు వచ్చిన ఆయన.. సామాన్యుడిలా క్యూలో నిలుచున్నారు. రాంపుర్​లోని పోలింగ్​ బూత్​లో ఓటు వేశారు నఖ్వీ.

జూనియర్​ పారికర్​..

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు, పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉత్పల్​ పారికర్​ పోలింగ్​ బూత్​లను సందర్శించారు.

08:11 February 14

ఉత్తరాఖండ్‌లో..

ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్​ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 13 జిల్లాల్లోని 70 నియోజకవర్గాల్లో పోలింగ్​ జరుగుతుండగా.. 11,647 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 82,38,187 మంది ఓటర్లు తేల్చనున్నారు.

07:50 February 14

ఓటు వేసిన హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ రాజేంద్ర విశ్వనాథ్​ అర్లేకర్​. వాస్కో డ గామా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ బూత్​ 7లో తన భార్యతో కలిసి ఓటు వేశారు.

07:21 February 14

  • Polling will be held across Uttarakhand, Goa and in parts of Uttar Pradesh. I call upon all those whose are eligible to vote today to do so in record numbers and strengthen the festival of democracy.

    — Narendra Modi (@narendramodi) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రికార్డ్​ స్థాయిలో తరలిరావాలి..

గోవా, ఉత్తరాఖండ్​ సహా ఉత్తర్​ప్రదేశ్​ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అర్హులైన వారంతా రికార్డు స్థాయిలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని సూచించారు.

07:16 February 14

ఓటు హక్కు వినియోగించుకున్న గోవా గవర్నర్ దంపతులు​

గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయాన్ని పోలింగ్​ కేంద్రానికి చేరుకున్న.. గోవా గవర్నర్​ పీఎస్​ శ్రీధరన్​ పిల్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలైగోవా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ బూత్​ 15లో ఓటు వేశారు.

06:56 February 14

Assembly polls: గోవా, యూపీ రెండో దశ పోలింగ్​ షురూ

గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఒకే దశలో మొత్తం 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు జిల్లాల్లోని 40 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. మొత్తం 11,56,464 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 1,722 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 301 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

యూపీలో రెండో దశ పోలింగ్..

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌

Last Updated : Feb 14, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.