కేరళ అలప్పుజలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత హత్యను నిరసిస్తూ భాజపా నేతలు తలపెట్టిన ఆందోళన... విధ్వంసానికి దారి తీసింది. మాస్క్ ధరించిన కొందరు దుండగులు స్థానిక దుకాణాలను ధ్వంసం చేశారు. ది సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్త మునీర్‌కు సంబంధించిన ఓ దుకాణానికి నిప్పంటించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అల్లర్లు చెలరేగడం వల్ల భద్రతను కట్టుదిట్టం చేశారు స్థానిక పోలీసులు.
అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చెర్తలకు సమీపంలోని నాగమ్కులనగర్లో ది సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ), ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో రాహుల్ కృష్ణ అలియాస్ నందు అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి చెందాడు.
'ప్రభుత్వం వారికే మద్దతిస్తోంది'
ఎస్డీపీఐ కార్యకర్తలు నందును హత్య చేశారని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో కేరళ అధికార పార్టీ కూడా పాపులర్ ఫ్రంట్కే మద్దతుగా ఉంటోందని విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలపాలను అడ్డుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. పీఎఫ్ఐని ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'టీ కోసం భార్యపై దాడా? సమ్మతం కాదు'