ETV Bharat / bharat

సర్పంచ్​గా గెలిచిన వ్యక్తికి నోట్లదండ.. ఓడిన అభ్యర్థికి రూ.11 లక్షల నగదు, కారు, భూమి - ఎన్నికల్లో ఓడిన అభ్యర్థికి కారు ఇచ్చిన గ్రామస్థులు

హరియాణాలో అరుదైన ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఓ అభ్యర్థికి గ్రామస్థులు భారీగా నగదు, కారు, కొంత భూమిని గిఫ్ట్​గా ఇచ్చారు. మరోవైపు, ఫరీదాబాద్​లోని ఓ గ్రామానికి సర్పంచ్​గా ఎన్నికైన వ్యక్తికి రూ.11 లక్షల విలువైన నగదుతో మాల వేసి సన్మానించారు.

panchayat election in Haryana
ఓడిన అభ్యర్థికి నగదు ఇస్తున్న గ్రామస్థులు
author img

By

Published : Nov 27, 2022, 9:56 AM IST

Updated : Nov 27, 2022, 10:06 AM IST

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి సంబరాలు చేసుకోవడం, ఓడిన అభ్యర్థి నిరాశకు గురికావడం సాధారణమే. ఓటమిపాలైన అభ్యర్థిని ప్రత్యర్థులు సైతం రెచ్చగొడుతుంటారు. అయితే హరియాణాలో మాత్రం ఓడిన అభ్యర్థికి గ్రామస్థులు అరుదైన కానుకలు ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే..
ఫతేహాబాద్‌లోని నాడోడి గ్రామానికి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సుందర్​, నరేంద్ర అనే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. ఆ గ్రామంలో మొత్తం 5,085 మంది ఓటర్లు ఉన్నారు. 4,416 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో సుందర్​కు 2,200 ఓట్లు పడగా.. నరేందర్​కు 2,201 ఓట్లు పడ్డాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో సుందర్​ ఓడిపోయారు. అప్పుడు సుందర్​ను.. నధోడి గ్రామస్థుసు సన్మానించి రూ.11,11,000 నగదు అందించారు. ఓ స్విప్ట్ డిజైర్​ కారు, కొంత భూమిని సైతం అతడికి ఇచ్చారు. నగదు, కారును గ్రామస్థులు విరాళాలు వేసుకుని ఇవ్వగా.. అదే గ్రామానికి చెందిన సుభాశ్ అనే వ్యక్తి భూమిని ఇచ్చారు. గ్రామస్థులు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో నాడోడి గ్రామస్థులకు సుందర్ కృతజ్ఞతలు చెప్పారు. గ్రామస్థుల ప్రేమే తనకు పెద్ద విజయమని అన్నారు. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.

panchayat election in Haryana
ఓడిపోయిన అభ్యర్థికి నగదు ఇస్తున్న గ్రామస్థులు

గెలిచిన అభ్యర్థి భారీ నగదు మాల..
మరోవైపు, హరియాణా, ఫరీదాబాద్​లోని ఫతేఫుర్​ తాగా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్​ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ​రూ.11 లక్షల విలువైన ఐదు వందల రూపాయల నోట్లతో భారీ గజమాల తయారుచేసి సర్పంచ్​ మెడలో వేశారు. ఫతేపుర్ తాగా గ్రామానికి సర్పంచ్​గా ఆస్ మహ్మద్ ఎన్నికయ్యారు. దీంతో గ్రామస్థులు ఆయనను గ్రామస్థులు సన్మానిస్తున్న ఫొటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

panchayat election in Haryana
గెలిచిన అభ్యర్థి మెడలో రూ.500 నోట్లతో గజమాల

'గ్రామస్థులు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ప్రజా సేవకుడిగా ఉంటా. ఫతేపుర్​ తాగాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. గ్రామాభివృద్ధికి గ్రామస్థులతో కలిసి ఐక్యంగా కృషి చేస్తా.'
-- ఆస్ మహ్మద్​, గెలిచిన అభ్యర్థి

కొద్ది రోజుల క్రితం కూడా హరియాణా పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి గ్రామస్థులు భారీగా నగదు, కారు అందించడం చర్చనీయాంశమైంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Nov 27, 2022, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.