ETV Bharat / bharat

'రోజూ చేపలు తినండి.. ఐశ్వర్యరాయ్​లా మీ కళ్లు తయారవుతాయి'.. మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు - మహారాష్ట్ర మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

Vijaykumar Gavit Comments on Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ లాంటి కళ్ల కోసం రోజూ చేపలు తినాలన్నారు మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయ్​ కుమార్​ గావిట్​. చేపలు తింటే చర్మం మృదువుగా తయారవుతుందని.. కళ్లల్లో మెరుపులు వస్తాయని వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

vijaykumar-gavit-comments-on-aishwarya-rai-eating-fish-will-make-eyes-as-beautiful-as-those-of-aishwarya-rai-says-minister

author img

By

Published : Aug 21, 2023, 7:11 PM IST

Updated : Aug 21, 2023, 8:21 PM IST

Vijaykumar Gavit Comments on Aishwarya Rai : రోజూ చేపలు తింటే.. ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు తయారవుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ​మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయ్ కుమార్​ గావిట్. చేపల తినడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుందని.. కళ్లలో మెరుపులు వస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో మీ వైపు చూసేవారు ఆకర్షణకు గురవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్​​ గావిట్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

"రోజు చేపలు తింటే చర్మం మృదువుగా తయారువుంది. కళ్లల్లో మెరుపులు వస్తాయి. ఎవరైనా మీ వైపు చూస్తే వెంటనే ఆకర్షితులవుతారు. ఐశ్వర్య రాయ్​ మంగళూరులోని సముద్ర తీరం సమీపంలో నివసించేవారు. ఆమె రోజు చేపలు తింటారు. మీరు ఆమె కళ్లు చూశారా? ఎంతో అందంగా ఉంటాయి. అందుకే మీరు చేపలు తినండి. మీ కళ్లు కూడా అలాగే తయారవుతాయి." అని మంత్రి విజయ్​ కుమార్​ గావిట్​ అన్నారు. చేపల్లో కొన్ని నూనెలు ఉంటాయని.. అవి చర్మాన్ని మృదువుగా చేస్తాయన్నారు. సోమవారం నందుర్బార్​ జిల్లాలోని ఓ బహిరంగ సభలో మంత్రి చేసిన ఈ కామెంట్స్​.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారాయి.

మహరాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయ్​ కుమార్​ గావిట్ వ్యాఖ్యలు

మంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర శాసన మండలి సభ్యులు, ఎన్​సీపీ నేత అమోల్ మిత్కారీ​. ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేసే బదులు.. గిరిజనుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నితేశ్​ రాణె కూడా మంత్రి విజయ్​ కుమార్​ గావిట్​ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను రోజూ చేపలు తింటానని.. కానీ ఐశ్వర్యరాయ్​ లాంటి కళ్లు తనకేమి లేవని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి పరిశోధన ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు నితేశ్​ రాణె.

సినీ నటి ఖుష్బూపై వివాదాస్పద వ్యాఖ్యలు..
Sivaji Krishnamurthy Comments On Kushboo : కొన్నాళ్ల క్రితం ఓ సమావేశంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు డీఎంకే పార్టీ నేత శివాజీ కృష్ణమూర్తి. అంతకు ముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Rahul Gandhi Bike Trip : 18 వేల అడుగుల ఎత్తైన రహదారిపై రాహుల్ బైక్ రైడింగ్.. వీడియో చూశారా?

Supreme Court On Manipur : 'మణిపుర్'​ కమిటీ మూడు నివేదికలు.. ఆ రోజు ఉత్తర్వులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు

Last Updated : Aug 21, 2023, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.