ETV Bharat / bharat

Vijayawada Engineering Students With CBN : 'అడుగడుగునా పోలీసు జులుం'.. ఏపీలో ఎమర్జెన్సీ పెట్టారా..?: లోకేశ్ ఫైర్ - Lokesh Fire On Police

Vijayawada Engineering Students With CBN : విజయవాడలో వివిధ కళాశాలల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన నారా లోకేశ్.. ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటూ ధ్వజమెత్తారు.

vijayawada_engineering_students_with_cbn

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 7:58 PM IST

Updated : Sep 15, 2023, 10:33 PM IST

Vijayawada Engineering Students With CBN : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు నిరసనకు దిగుతారని పోలీసులు వివిధ కళాశాలల్ని ఖాళీ చేయించారు. విద్యార్థులు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వాట్సాప్ ల్లో మెసేజ్ లు పెట్టుకున్నారు. రాష్ట్రంలో తాము ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తున్నామంటే.. అందుకు ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు పెద్ద ఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రోత్సహించడమేనంటూ విద్యార్థులు తమ అభిప్రాయాలను వాట్సప్​లో పంచుకున్నారు. ఉన్నత విద్యకోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా స్థానికంగానే చదువుకునే ఏర్పాటుకు సూత్రధారి అయిన చంద్రబాబుకు అంతా మద్దతుగా నిలవాలని సందేశాలు పంపించుకున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు తెలుపుతామంటూ వివిధ కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా పోలీసులు ముందస్తుగా కట్టడి చేశారు.

Vangalapudi Anitha Fires on Ministers About Chandrababu Security: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి ఈ మంత్రులు ఎవరు..?: అనిత

Police Warns Students: క్రిమినల్ కేసులు తప్పవంటూ హెచ్చరిక.. మధ్యాహ్నం 12గంటల సమయంలో వివిధ కళాశాలల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని బంగారు జీవితాన్ని పాడు చేసుకోవద్దంటూ విద్యార్థులకు పోలీసులు సూచించారు. నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెడతామంటూ పరోక్ష హెచ్చరికలు ఇచ్చారు. 144సెక్షన్, పోలీస్ 30యాక్ట్ అమల్లో ఉన్నందున ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడ వద్దంటూ ఆదేశించారు. పెనమలూరు, గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో కళాశాలల విద్యార్థులకు పోలీసులు నోటీసులు పంపారు. మొబైల్ లో చిత్రీకరిస్తున్న పలువురు విద్యార్థుల ఫోన్లు లాక్కున్న పోలీసులు.. ఎక్కువ చేశారంటే వ్యాన్ ఎక్కిస్తామంటూ బెదిరించారని విద్యార్థులు తెలిపారు.

Students Fire on Police: మండిపడిన విద్యార్థులు.. సిద్ధార్థ ఇంజినీరింగ్, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పోలీసులు పెద్దఎత్తున వెళ్లారు. లాఠీ ఛార్జీకి ప్రయోగించే ఇతర వస్తువులతో కవాతు చేసి చదువుల కొలువులో యుద్ద వాతావరణం సృష్టించారు. తామూ ఒకప్పటి విద్యార్థులమే అనే విచక్షణ మరచి తీవ్రవాదుల స్థావరాలను చుట్టుముట్టినట్టు కళాశాలను చుట్టుముట్టడం విస్మయానికి గురిచేసింది. తరగతులు సస్పెండ్ చేయించి బలవంతంగా కళాశాలలకు సెలవు ఇప్పించారు. కళాశాలలో ఎవ్వరూ ఉండకూడదంటూ విద్యార్థుల్ని బలవంతంగా బయటకు పంపారు. తరగతి గదిలో అధ్యాపకులు బోధిస్తుండగానే కనీస మర్యాద పాటించని పోలీసులు... ఇవాళ బోధన లేదు ఏమీలేదు బయటకు పోండంటూ దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు వాపోయారు. తమ ఎదుటే తమ ప్రొఫెసర్ల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం ఎంతో బాధ కలిగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు విడుదల కోసం.. ఆలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు

Lokesh fire on Police: పోలీసులపై లోకేశ్ ఆగ్రహం.. ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న విజయవాడలో వివిధ కళాశాలల విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గమని మండిపడ్డారు. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతులు సస్పెండ్ చేయించి కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణమని దుయ్యబట్టారు. నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉధృతం అవుతుందని గుర్తుంచుకోండి సైకో పాలకులారా అని హితవు పలికారు.

  • ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా? చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న విజయవాడలో వివిధ కళాశాలల విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోంది.… pic.twitter.com/t33wI8b6nQ

    — Lokesh Nara (@naralokesh) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్, బెంగళూరు ఇతర నగరాలు, పట్టణాలలో రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ఐటీ ఉద్యోగులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సెల్యూట్ చేసారు. ప్రేమ, ఆప్యాయతలను చాటుకున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. మద్దతు తెలుపుతున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

  • I salute the thousands of IT employees who have hit the roads in Hyderabad, Bangalore and other cities and towns in support of @ncbn Garu. We are forever indebted to each of you for your unconditional outpouring of love and affection. Thank you all from the bottom of my heart.… pic.twitter.com/gulLdyUhMZ

Tension at Gitam: గీతం వద్ద ఉద్రిక్తత.. జనసేన టీడీపీ పొత్తు స్వాగతిస్తూ విశాఖలో గీతం విశ్వ విద్యాలయం వద్ద వెలసిన పోస్టర్లను పోలీసులు తొలగించారు. విశ్వ విద్యాలయం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఐడీ కార్డులను చెక్​ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. అన్ని వైపులా గేట్ల వద్ద పోలీసులు మోహరించి ఐడీ కార్డ్ చెకింగ్ చేసి గాని లోనికి పంపలేదు. ఈ పరిస్థితిని ప్రశ్నించిన జనసేన భీమిలి ఇంచార్జి పంచకర్ల సందీప్ ను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసమై పోయిందని సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు.

Woman Protest at Vijayawada: మహిళల ఆందోళన... చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయవాడ వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. వీఆర్‌ సిద్ధార్థ కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... మహిళలను అడ్డుకుని అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తోన్న తమను అడ్డుకున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ కళాశాలల నుంచి మధ్యాహ్నమే విద్యార్థులను పంపేసిన పోలీసులు... అందోళనకు దిగిన విద్యార్థులను అడ్డుకుని మరోప్రాంతానికి తరలించారు.

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ.. ఈనెల 19కి వాయిదా

Last Updated : Sep 15, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.