ETV Bharat / bharat

బొమ్మల రిపేరుకు కేరాఫ్​ అడ్రస్​ ఈ విజయన్​

చిన్నపిల్లల ఆట వస్తువుల్ని రిపేరు చేసే అతనికి చిన్నప్పటి నుంచి బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే 12 ఏళ్ల క్రితం అతని జీవితాన్ని హెలికాప్టర్​ బొమ్మ మలుపు తిప్పింది. మరి ఎలా అతని జీవితం మలుపు తిరిగింది? ఆ వృత్తిని ఎంచుకోవడానికి ఏమైనా కారణం ఉందా?

author img

By

Published : Feb 14, 2021, 9:39 AM IST

Vijayans life is not a childs play, yet it is filled with toys
విజయన్​ జీవితాన్ని మలుపు తిప్పిన 'హెలికాప్టర్'​

కేరళలోని కొచ్చికి చెందిన విజయన్​.. చిన్న పిల్లల ఆట వస్తువులకు మరమ్మతులు చేస్తుంటాడు. రేసింగ్​ కార్ల నుంచి మామూలు ఆట బొమ్మల వరకు ప్రతిదానిని బాగు చేస్తాడు. ఇందులో ఏముంది.. చాలా మంది చిన్న పిల్లల ఆట వస్తువుల్ని రిపేరు చేస్తారు కదా అని మీరనొచ్చు. బొమ్మల్ని రిపేరు చేయడానికి వెనకున్న విజయన్​ కథే వేరు.

ఆట బొమ్మల్ని రిపేరు చేస్తోన్న విజయన్​

విజయన్​కు చిన్నప్పటి నుంచి ఆట బొమ్మలంటే చాలా ఇష్టం. బొమ్మలమీద అతనికి ఎంత ఇష్టమంటే కూలీ పని చేస్తూ కూడా తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని బొమ్మలు కొనడానికే ఖర్చు చేసేవాడు. ఉపాధి కోసం ఇడుక్కి నుంచి కొచ్చి వచ్చినా తన అలవాటును మార్చుకోలేదు. అలా వాటిపై మక్కువతో చాలా బొమ్మల్ని కొనుగోలు చేశాడు.

Vijayans life is not a childs play, yet it is filled with toys
ఈటీవీ భారత్​తో విజయన్​

ఆట బొమ్మల్ని రిపేరు చేస్తున్న విజయన్​

విజయన్​ ఇంట్లో ఉన్న ఆటబొమ్మలు

విజయన్​ ఇంట్లో చిన్నపిల్లల ఆటబొమ్మలు

జీవితాన్ని మలుపు తిప్పిన హెలికాప్టర్​

12 ఏళ్ల కిత్రం తను కొన్న హెలికాప్టర్​ బొమ్మ అతని జీవితాన్నే మార్చేసింది. చాలా రోజుల నుంచి దాచుకున్న రూ.3000లతో ఆ హెలికాప్టర్​ బొమ్మకొన్నాడు. కానీ కొన్న కొద్దిరోజులకే ఆ బొమ్మ పాడయింది. బొమ్మను అమ్మిన దుకాణాదారుడి దగ్గరకెళ్లి.. పాడైన విషయం చెప్పాడు. అయితే బొమ్మకు గ్యారంటీ లేదని.. మరో బొమ్మ ఇవ్వడం కుదరదన్నాడు. దాంతో స్వయంగానే విజయన్​ బొమ్మని బాగు చేసుకున్నాడు. అంతేకాకుండా తాను కొన్న బొమ్మమీద రూ.200 లాభంతో దాన్ని తన స్నేహితునికి అమ్మాడు.

విషయం తెలుసుకున్న దుకాణదారుడు తన దగ్గర పాడైన హెలికాప్టర్​ బొమ్మలు మరో రెండు ఉన్నాయని.. వాటిని కూడా రిపేరు చేయమని విజయన్​ని కోరాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా అతను వెనకకు తిరిగి చూసుకోలేదు. పాడైన బొమ్మల్ని రిపేరు చేస్తూనే ఉన్నాడు. పనిచేయని బొమ్మలతో తన దగ్గరకొచ్చిన ఏ ఒక్కరినీ అతను నిరుత్సాహపరచలేదు. అలా అతను బొమ్మలు రిపేరు చేయడంలో ఫేమస్​ అయ్యాడు.

ఇదీ చూడండి: రాహుల్​ దేశ వినాశకారిగా మారుతున్నారు: నిర్మల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.