Vijayakanth Health Status : నటుడు, డీఎండీకే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. విజయకాంత్‌కు చికిత్స అందిస్తున్న సంబంధిత వైద్యులతో మాట్లాడిన అనంతరం మంత్రి ఈ ప్రకటన చేశారు. కాగా, గతంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ విజయకాంత్ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఆరోగ్య సమస్య తలెత్తడం వల్ల ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని.. ఆరోగ్యం కూడా సాధారణంగానే ఉందని మంత్రి స్పష్టం చేశారు.
'ఒకట్రెండు రోజుల్లో ఇంటికి..'
Vijayakanth Health Now : ఇక విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై బయట జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు డీఎండీకే నేతలు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలను కోరారు. విజయ్‌కాంత్‌కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన కోలుకొని ఇంటికి తిరిగి వెళ్తారని అన్నారు. కాగా, విజయకాంత్‌కు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నారన్న తప్పుడు వార్తలపై ఘాటుగానే స్పందించారు పార్టీ నాయకులు. ఇటువంటి వార్తలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచించారు.
ప్రభుత్వాస్పత్రిలో మంత్రికి చికిత్స!
Senthil Balaji Health Condition : మరోవైపు.. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఆరోగ్య పరిస్థితిపై కూడా వివరణ ఇచ్చారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్. సోమవారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'సెంథిల్ బాలాజీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన్ను తమిళనాడు ప్రభుత్వ మల్టీపర్పస్ ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయించాం. ఈ పరీక్షల్లో అతని మూత్రాశయంలో ఒక చిన్నపాటి కొవ్వు గడ్డని గుర్తించారు వైద్యులు. అనంతరం శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. అలాగే ఆయన మెడ నొప్పితో బాధపడుతున్నారు. వీటితో పాటు ఇతర అనారోగ్య సమస్యలను వైద్యులు దగ్గరుండి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక వైద్య బృందం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాము' అని సుబ్రహ్మణియన్ అన్నారు. ఇక మంత్రి బాలాజీకి అందుతున్న చికిత్సతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి నివేదికను మంగళవారం వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.
సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం- మెట్రో బారికేడ్ వద్ద వదిలేసి!
జీన్స్ వేసుకోమంటున్న అత్త- చీరలే కట్టుకుంటానన్న పల్లెటూరి కోడలు- పోలీస్‌స్టేషన్‌కు పంచాయతీ!