దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతితో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ తరుణంలో సరైన వైద్యం అందక చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనే జరిగింది కర్ణాటక బెంగళూరు రూరల్ జిల్లా అనెకల్లో. గత వారం క్రితం ఓ యువకుడిని జ్వరం లక్షణాలతో ఆక్స్ఫర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి యువకుడి పరిస్థితిపై అతని తల్లికి ఎలాంటి సమాచారం అందించలేదు వైద్యులు.
వారం రోజుల పాటు ఆసుపత్రి బయటే గడిపింది తల్లి. ఈ క్రమంలోనే తనను ఈ ఆసుపత్రి చంపేస్తుందని, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లాలని శుక్రవారం ఓ వీడియో ద్వారా కోరాడు యువకుడు. శనివారం.. అతను మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తల్లికి తెలిపాయి. దీంతో ఆసుపత్రి బయటే కన్నీటిపర్యంతమైంది తల్లి.
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో 25 మంది రోగులు మృతి