Kedarnath Horse Smoking : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్లో జంతువులు హింసకు గురవుతున్నాయి. పర్వతాలను ఎక్కుతూ.. మనుషుల్ని, వస్తువుల్ని తరలించే గుర్రాలు, గాడిదలను హింసకు గురిచేస్తున్నారు. వీటికి బలవంతంగా ధూమపానం తాగిస్తున్నారు వాటి యజమానులు. కర్రలు, రాడ్లతో కొడుతూ.. దీంతో గాయాలైనా పని చేయిస్తూ.. వాటిపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గుర్రానికి ధూమపానం తాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
'చోద్యం చూస్తూ.. వ్యవస్థ నిద్రపోతోంది..'
Kedarnath Horse Cruelty : ఈ పరిస్థితిపై జంతుసంరక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పీపుల్ ఫర్ యానిమల్ సంస్థ ప్రతినిధి గౌరీ మౌలేఖీ స్పందించారు. 'గతేడాది కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. జంతువుల మృతదేహాలను నదుల్లో విసిరేస్తున్నారు. బలహీనమైన జంతువులతో పని చేయిస్తున్నారు. అక్కడ 2,500 జంతువుల మాత్రమే అనుమతి ఉంటే.. 1,400 జంతువులతోనే పనిచేయిస్తున్నారు. జంతువులు అలసిపోయినా.. వాటికి మత్తు ఇచ్చి ఉపయోగిస్తున్నారు. అవి చనిపోయేలా హింసిస్తున్నారు. ఇదంతా చూస్తూ వ్యవస్థ నిద్రపోతోంది' అని గౌరీ మౌలేఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలపై పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. అయినా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
"ఇలాంటి ఘటనలు కేవలం బద్రీనాథ్, కేదార్నాథ్లోనే జరగడం లేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి పుణ్య క్షేత్రాల్లో 2-3 నెలల పని ఉంటుంది. దీంతో ఏడాదికి సరిపడా ఇప్పుడు సంపాదించాలని.. గుర్రాలు, గాడిదలను హింసకు గురిచేస్తున్నారు. ప్రతి జంతువుకు పని చేయడానికి ఒక సామర్థ్యం ఉంటుంది. కానీ, ఇలాంటి ప్రాంతాల్లో వాటి శక్తికి మించి 4-5 రెట్లు ఎక్కువ పనిచేయిస్తున్నారు. అలా వాటి సామర్థ్యం పెంచడానికి మత్తు పదార్థాలు ఇస్తున్నారు. ఇలాంటివి ఇవ్వడం వల్ల జంతువుల అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. దీంతో అవి అనారోగ్యం పాలవుతాయి. అయినా వాటిని పనిచేయిస్తారు. దీంతో క్రమంగా ఆరోగ్యం క్షీణించి చనిపోతాయి. ఇది జంతు హింస కిందకు వస్తుంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను"
--డాక్టర్ సందీప్, పుశువైద్యుడు
Horse Smoking a Cigarette : ఈ వీడియోపై స్పందించిన డాక్టర్ అశోక్ పన్వార్.. ఆ వీడియోలు తన వద్దుకు కూడా వచ్చాయని చెప్పారు. జంతువులకు ధూమపానం తాగిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని.. కేదార్‌నాథ్ సెక్టార్ అధికారి, స్థానిక వైద్యులను ఆదేశించారు. ఈ వీడియో పశుసంవర్థక శాఖ మంత్రి సౌరభ్ బహుగుణ దృష్టికి కూడా వెళ్లింది. ఈ విషయంపై ఈటీవీ భారత్ వివరణ కోరగా.. నిందితులను గుర్తించామని.. వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
-
सोशल मीडिया पर पशु क्रूरता से सम्बन्धित प्रसारित हो रहे वीडियो का संज्ञान लेकर सेक्टर अधिकारी की शिकायत पर संबंधित घोड़ा संचालक के विरुद्ध अभियोग पंजीकृत कर वैधानिक कार्यवाही की जा रही है। अश्ववंशीय पशुओं के साथ हो रही क्रूरता के सम्बन्ध में अब तक कुल 14 अभियोग पंजीकृत किये हैं। pic.twitter.com/43GpTM6B5V
— उत्तराखण्ड पुलिस - Uttarakhand Police (@uttarakhandcops) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">सोशल मीडिया पर पशु क्रूरता से सम्बन्धित प्रसारित हो रहे वीडियो का संज्ञान लेकर सेक्टर अधिकारी की शिकायत पर संबंधित घोड़ा संचालक के विरुद्ध अभियोग पंजीकृत कर वैधानिक कार्यवाही की जा रही है। अश्ववंशीय पशुओं के साथ हो रही क्रूरता के सम्बन्ध में अब तक कुल 14 अभियोग पंजीकृत किये हैं। pic.twitter.com/43GpTM6B5V
— उत्तराखण्ड पुलिस - Uttarakhand Police (@uttarakhandcops) June 23, 2023सोशल मीडिया पर पशु क्रूरता से सम्बन्धित प्रसारित हो रहे वीडियो का संज्ञान लेकर सेक्टर अधिकारी की शिकायत पर संबंधित घोड़ा संचालक के विरुद्ध अभियोग पंजीकृत कर वैधानिक कार्यवाही की जा रही है। अश्ववंशीय पशुओं के साथ हो रही क्रूरता के सम्बन्ध में अब तक कुल 14 अभियोग पंजीकृत किये हैं। pic.twitter.com/43GpTM6B5V
— उत्तराखण्ड पुलिस - Uttarakhand Police (@uttarakhandcops) June 23, 2023
కేదార్‌నాథ్ యాత్రలో 399 జంతువులు పర్వతాలను ఎక్కలేకపోతున్నాయి. వాటిని అనర్హమైనవిగా ప్రకటించారు అధికారులు. అయినా వాటితో పనిచేయిస్తున్నారు వాటి యజమానులు. అలాంటి 15 మంది యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించని 211 మందికి జరిమానా విధించారు. మరో 300 మందిపై నిషేధం విధించారు.