ETV Bharat / bharat

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు రెండోసారి కరోనా - corona

Vice president Venkaiah Naidu Corona: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్​లో ఉన్న ఆయన.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

Vice president Venkaiah Naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
author img

By

Published : Jan 23, 2022, 4:41 PM IST

Updated : Jan 23, 2022, 5:16 PM IST

Vice president Venkaiah Naidu Corona: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు రెండోసారి కరోనా సోకింది. ఆదివారం నిర్వహించిన కొవిడ్​ పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లో ఉన్నట్లు తెలిపింది.

వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు పేర్కొంది. ఆయనతో కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది.

2020, సెప్టెంబర్​ 30న తొలిసారి..

2020, సెప్టెంబర్​లో తొలిసారి కరోనా బారినపడ్డారు వెంకయ్య. సెప్టెంబర్​ 30న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. పార్లమెంట్​ వర్షకాల సమావేశాలకు హాజరైన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించారు. ఆయనతో పాటు మరో 25 మందికి వైరస్​ సోకింది.

పార్లమెంట్​లో 875 మందికి కరోనా..

పార్లమెంట్​లో ఇప్పటి వరకు 875 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అందులో రాజ్యసభ సచివాలయంలోనే 271 మందికి కొవిడ్​ సోకింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'దేవుడిపై ఒట్టు.. పార్టీ మారం'.. ప్రమాణం చేయిస్తున్న కాంగ్రెస్​

Last Updated : Jan 23, 2022, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.